సాధారణంగా ఒక కుటుంబం ప్రేమానురాగాలతో సుఖసంతోషాలతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంట్లోని స్త్రీ గుణవంతురాలై ఉండాలి.ఇలా ఆ స్త్రీ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ కుటుంబం సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయని ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు.ఇలా ఇంటిని చూసి ఇల్లాలిని అంచనా వేయవచ్చని చాణిక్యుడు తెలియజేస్తుంటారు.
ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ కచ్చితంగా ఉంటుందని మన పెద్దవారు చెబుతుంటారు. అలాగే ఒక పురుషుని పతనం వెనుక ఇప్పుడు చెప్పబోయే లక్షణాలున్న స్త్రీలు కూడా కచ్చితంగా ఉంటారని చెప్పొచ్చు.
ముఖ్యంగా నోట్లో మాట దాగని స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పే స్త్రీల వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి ఒక్కొక్కసారి ప్రాణాలకే హాని కలగవచ్చు. వీరి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అలవాటు ఉన్నటువంటి మహిళల దగ్గర కొన్ని విషయాలు చెప్పకపోవడమే ఎంతో మంచిది ఇలా నోట్లో మాట రాగని స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.
మీ జీవితంలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే స్త్రీ ఉంటే మీరు ఆర్థికంగా ప్రగతి సాధించలేరు. దుబారా ఖర్చులు వస్తే మీ అవసరాలకు డబ్బు లేక చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత సంపాదించిన మీకు తోడుగా ఉండేది మీరు పొదుపు చేసిన సొమ్ము మాత్రమే అనేది గ్రహించాలి. ఇక అలాగే చీటికిమాటికి గొడవ పెట్టుకుని కోపం తెచ్చుకునే మహిళను అసలు నమ్మకూడదు. ఇలాంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్షణికావేశంలో ఎలాంటి పనికైనా వెనకాడరు. తన కోపమే తనకు శత్రువు ఈ వాక్యం మగవారి కైనా ఆడవారికైనా ఒకేలా వర్తిస్తుంది. ఇలా ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు.