మనలో చాలామంది సులువుగా లక్షాధికారులు కావాలని భావిస్తూ ఉంటారు. లక్షాధికారి అయ్యే విషయంలో కొందరు సులువుగా అనుకున్న లక్ష్యానికి చేరువైతే మరి కొందరు మాత్రం ఎంత కష్టపడినా లక్షాధికారి కాలేరు. అయితే ఒకే ఒక్క సమాచారం అందించడం ద్వారా సులువుగా 20 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. దేశంలో పన్ను ఎగవేతదారులు చాలామంది ఉన్నారనే సంగతి తెలిసిందే.
ఇలాంటి వాళ్ల వివరాలను అందిస్తే సులువుగా సెబీ నుంచి 20 లక్షల రూపాయలు పొందవచ్చు. అవినీతిని అరికట్టాలనే ఆలోచనతో సెబీ ఈ కొత్త స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. కచ్చితమైన సమాచారం ఇచ్చేవాళ్లు మాత్రమే ఈ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ రివార్డ్, ఇంటీరియం రికార్డ్ రెండు రకాలుగా ఉండగా పొందే మొత్తంలో ఏది తక్కువ ఉంటే ఆ మొత్తం పొందే ఛాన్స్ ఉంటుంది.
ఇంటీరియం రివార్డ్ 5 లక్షల రూపాయలు కాగా ఫైనల్ రివార్డ్ 20 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఎవరైతే సమాచారం ఇచ్చారో వారి వివరాలను సెబీ గోప్యంగా ఉంచుతుంది. సులువుగా సమాచారం ఇవ్వడం ద్వారా తక్కువ సమయంలోనే లక్షాధికారి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే రిలీజ్ చేసిన 515 మంది ఎగవేతదారులకు సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా తెలియజేయవచ్చు.
ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. సెబీ రూల్స్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.