ఇకపై రైల్వే ఈ- టికెట్ బుక్ చేయడం మరింత సులభం… నోటితో చెబితే చాలు టికెట్ బుక్ అయినట్లే!

ఇండియన్ రైల్వే ఇప్పటికే ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తూ ప్రయాణికులకు రైలు ప్రయాణాన్ని ఎంతో సులభతరం చేస్తుంది.ఇలా రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇండియన్ రైల్వే అన్ని ఏర్పాట్లను చేస్తుంది. అయితే తాజాగా రైల్వే శాఖ మరొక అధునాతనమైన సదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తుంది.ఇప్పటికే ఐఆర్‌సీటీసీ యాప్‌ ద్వారా మెరుగైన సౌకర్యాలను అందిస్తున్న సంస్థ.. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విషయంలో సరికొత్త విధానాలను అమలులోకి తీసుకురానుంది.

ఇప్పటికే వినియోగదారుల సందేహాల నివృత్తి కోసం ‘ఆస్క్‌ డిశా'(డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం) పేరుతో చాట్‌ బాట్‌ను ఆవిష్కరించిన ఐఆర్‌సీటీసీ.. ఇప్పుడు ఈ చాట్‌ బాట్‌ అత్యాధునిక ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను అనుసంధానించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది దీని ద్వారా కేవలం ప్రయాణికుడు తమ టికెట్ బుక్ చేసుకోవాలంటే నోటితో చెబితే చాలు వెంటనే వారి టికెట్ బుక్ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని వాయిస్‌ సెంట్రిక్‌ ఈ-టెకెటింగ్‌ అని అంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆన్లైన్ ద్వారా రైలులో ప్రయాణించే వాళ్ళు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి, అందులోని ఫారమ్‌లో ప్రయాణికుల పేరు, ఇతర వివరాలు నమోదు చేసి సబ్మిట్‌ చేయాల్సి ఉండడంతో చాలా సమయం వృధా అవుతుంది. ఫలితంగా మనకు టికెట్ ఖాళీ కనిపించి బుక్ చేసిన ఈ ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలోపు ఆ సీట్ కూడా ఫీల్ అయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి అయితే ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండకుండా నోటితో చెబుతూ టికెట్ బుక్ చేసుకోవచ్చు. చాట్‌బాట్ ‘ఆస్క్ దిశ 2.0’ సహాయంతో ప్రయాణికులు టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు దీనికోసం వాయిస్ కమాండ్ ఉపయోగించాలి.దీని ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకోవాలన్న రద్దు చేసుకోవాలన్న చేసుకోవచ్చు అలాగే ఫ్లాట్ ఫామ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చు. ఈ చాట్‌బాట్ హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.