ఒకప్పుడు ఎక్కడ చూసినా నోకియా ఫోన్లు కనిపించేవి. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వివిధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లు రావటంతో నోకియా వాడకం బాగా తగ్గిపోయింది. ఇదిలా ఉండగా 60 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా నోకియా తన లోగోని మార్చింది. వేగవంతమైన వృద్ది లో మార్పును ప్రతిబింబించేలా ఈ లోగో మార్చబడింది. కొత్త మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నోకియా తన పని విధానంలో మార్పులు చేసుకుంది. నోకియా టెలికాం పరికరాల విభాగానికి సీఈఓగా పెక్కా లండ్‌మార్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీనిలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. కొత్త CEO పెక్కా లండ్‌మార్క్ సంస్థ పురోగమనం కోసం త్రిముఖ ప్రణాళికను రూపొందించింది.
ఇందులో భాగంగా నోకియా ఇకపై దాని పేరు, లోగోలో నీలం రంగును ఉపయోగించదని తేల్చి చెప్పింది. అలాగే నిర్దిష్ట రంగు అలానే ఉండదని కూడా తెలిపింది. నోకియా ఇకపై కేవలం స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమే కాదని, వాణిజ్య సాంకేతిక సంస్థ అని లుండ్‌మార్క్ తెలిపారు. దీంతో నోకియా తన టెలికాం పరికరాల వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు ఇతర వ్యాపారాలకు పరికరాలను విక్రయించడంపై దృష్టి సారిస్తుంది. వీటిలో ఆటోమేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రైవేట్ 5G నెట్‌వర్క్‌ల కోసం సాధనాలు ఉన్నాయి. ఇక ఇటీవల నోకియా G22ను ప్రకటించింది. ఇది ఇంట్లోనే మరమ్మతులు చేసుకునేలా రూపొందించిన మొట్టమొదటి ఫ్రెండ్లీ బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఐదు నిమిషాల్లో దీని బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు. Nokia G22 లో ఒక తొలగించగల వెనుక కవర్, బ్యాటరీ, స్క్రీన్, ఛార్జింగ్ పోర్ట్‌తో సహా అన్ని భాగాలను సులభంగా ఓపెన్ చేసి తిరిగి ఫిట్ చేసుకునేలా డిజైన్ చేశారు.
ప్రస్తుతం ప్రజలు ఎక్కువ కాలం ఉండే నాణ్యమైన పరికరాలను కోరుకుంటున్నారు. కానీ, ఇప్పుడు వాటి కోసం ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో మళ్లీ మరమత్చు చేసుకునే విధంగా Nokia G22 డిజైన్ చేసింది.ఇక ఈ నోకియా G22 ఫోన్ పాక్షికంగా రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. 6.53-అంగుళాల స్క్రీన్, పెద్ద-సామర్థ్య బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. సెక్యూరిటీ అప్‌డేట్‌లు, రెండు ప్రధాన ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లు ప్రతి నెలా మూడేళ్లపాటు అందించబడతాయి.