ఐటి ప్రొఫెషనల్స్ హెడ్‌ఫోన్లను పెట్టుకోవడం వెనుక అంత రీజన్ ఉందా..?

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మన రోజువారి జీవితంలో అడుగడుగునా టెక్నాలజీ మనతో పాటు సమానంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ మీద పనిచేసే అనేక టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయడానికి ప్రోగ్రామింగ్ చాలా అవసరం. ఈ ప్రోగ్రామింగ్ అనేది ఏదైనా గాడ్జెట్‌ని తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అసలు ప్రోగ్రామర్లు ఎవరు? వారి పని ఏమిటి ? అని చాలామందికి సందేహం ఉంటుంది. మొబైల్ గేమ్‌లకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసే ఐటి నిపుణులను ప్రోగ్రామర్లు అంటారు.

అయితే వీరు ఎప్పుడు తలకు హెడ్ ఫోన్స్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అయితే మీరు ఇలా తరచూ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.టెక్నాలజీ గైడర్ నివేదిక ప్రకారం, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అనేక రకాల కంప్యూటర్ భాషలు అవసరం ఉంటుంది. C, C++ తో సహా అనేక ఇతర కష్టతరమైన భాషలు ఈ ప్రోగ్రామింగ్ లో ఉపయోగించబడతాయి. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ప్రోగ్రామర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి . చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ ప్రోగ్రాం లో లోపం సంభవిస్తుంది. అందువల్ల ఎటువంటి లోపాలు జరగకుండా వాటిని నివారించడానికి, ప్రోగ్రామర్లు హెడ్‌ఫోన్‌లను మాత్రమే ఉపయోగిస్తారు.

సాధారణంగా ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇతర శబ్దాల వల్ల ఏకాగ్రత చూపించలేరు. అయితే చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం ఇతర శబ్దాలు,సంభాషణలు వినిపించవు. ఇలా చేయడం ద్వారా.. వారి దృష్టి మరల్చబడదు. వారు ప్రోగ్రామింగ్‌పై పూర్తి దృష్టిని ఉంచగలరు. ఐటీ కంపెనీల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం అనేది వ్యక్తికి ఇబ్బంది కలగకూడదనే సంకేతంగా భావిస్తారు. అందువల్ల ఐటి ఎంప్లాయిస్ తరచు చెవులకు హెడ్ ఫోన్స్ ధరిస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వారి వద్ద హెడ్‌ఫోన్‌లు లేనప్పుడు, ఇయర్‌పీస్‌లను ఉపయోగిస్తారు. ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వారి దృష్టి మరల్చకుండా ఉండటానికి శబ్దం, సంభాషణ, ఇతర శబ్దాలు తక్కువగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటారు.