ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. కుటుంబమంతా ప్రశాంతంగా గడపాలనుకుంటే ఏదో ఒక సమస్య వచ్చి గొడవ జరిగి ప్రశాంతత అనేది కోల్పోవడం జరుగుతుంది. మీ ఇంట్లో ఉండే పద్ధతులే ఇలా జరగడానికి కారణం అయి ఉండొచ్చు. ఇవి గమనిస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో, లేదో ఇట్టే తెలుస్తుంది.
మీ ఇంట్లో వారు ఒకరిని విమర్శించడం, లేదంటే మీరు ఇతరులను విమర్శించడం జరిగిందంటే కచ్చితంగా ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే. అన్నింటినీ తప్పు పట్టడం, చేసిన ప్రతి పనిలో చిన్న చిన్న తప్పులను చూపిస్తూ పెద్దది చేయడం వంటివి జరిగితే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.
తరచుగా ఒకరిపై కంప్లైంట్ చేయడం, లేదా వేరే వాళ్లు మీపై కంప్లైంట్ చేయడం, ఇంట్లో ఏ పని చేయాలంటే అనవసరంగా విసుక్కోవడం, చిరాకు రావడం వంటివి జరిగినట్లయితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతత అనేది కోల్పోయినప్పుడు, ఇంట్లో ఉంటే ఉండాలి అనిపించకపోవడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం వంటివి ఎక్కడ సంభవిస్తే అక్కడ ఈ నెగటివ్ ఎనర్జీ ఉందని గ్రహించాలి.
దేవుళ్ళ విగ్రహాలను లేదా పటాలను ఎదురెదురుగా ఉంచకూడదు. పక్క పక్కన ఉండేవిధంగా అలవర్చుకోవాలి. మురికి బట్టలను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఉండాలి. నెగటివ్ ఎనర్జీనీ తరిమికొట్టాలంటే దొడ్డు ఉప్పు లేదా రాయి ఉప్పును అన్నీ గదులలో అన్ని మూలలో వేయాలి. 48 గంటల తర్వాత ఆ ఉప్పును తీసేస్తే నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయే అవకాశం ఉంది.
ఇంటిని, ఇంట్లోని వస్తువులను పైపైన దులపడం, పైపైన శుభ్ర చేయడం కాకుండా మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి తలుపులను కిటికీలను రోజు తీస్తూ మూస్తూ ఉండాలి. బయట నుండి వచ్చే స్వేచ్ఛగాలికి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోయే అవకాశం ఉంది. మెడిటేషన్ చేయడం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది.
అంటే కోపం చిరాకు తగ్గి ఏదైనా సమస్య వస్తే సైలెంట్ గా ఉండి పరిష్కారం కోసం ఆలోచిస్తాము. ఇంట్లో అక్కడక్కడ వెల్లుల్లి రెమ్మలను తగిలిస్తే, ఇంట్లోకి చెడుగాలి చెడు ఆలోచనలు దరిచేరవు. క్రిస్టల్స్ ను కిటికీలకు, గుమ్మాలకు,బాత్రూంలో దగ్గర, మెట్ల దగ్గర కట్టి వేలాడదీసినట్లయితే నెగటివ్ ఎనర్జీ వచ్చే ఆస్కారం ఉండదు.