మనలో చాలామంది దంతాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. దంతాలు ఆరోగ్యంగా ఉంటే కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో మారుతున్న ఆహారాపు అలవాట్ల వల్ల దంతాలు పుచ్చిపోవడం అనే సమస్య ఎంతోమందిని ఇబ్బంది పెడుతోంది. జంక్ ఫుడ్ తరచూ తినేవాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.
కొన్ని రకాల ఆహార పదార్థాలు దంతాలు త్వరగా పుచ్చిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతూ ఉంటాయి. అయితే సరైన సమయంలో సరైన పరిష్కార మార్గాలను పాటించడం ద్వారా ఈ సమస్యను కొంతమేర అధిగమించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మధుమేహం, రక్తపోటు సమస్యలతో బాధ పడేవాళ్లకు దంతాలు త్వరగా పుచ్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
తీపి పదార్థాలు, చాక్లెట్లు ఎక్కువగా తిన్నా కూడా దంతాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పాలు, పెరుగు, చీజ్ లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దంతాలు బలంగా తయారయ్యే విషయంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చెప్పవచ్చు. కూల్ డ్రింక్స్, సోడా, ఆల్కహాల్, జ్యూస్ లు ఎక్కువగా తాగితే కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
చక్కెర లేని చూయింగ్ గమ్ నమిలితే దంతక్షయం సమస్య దూరమవుతుంది. లాలాజలం ఎక్కువగా రావడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పవచ్చు. బ్రష్ లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చితే దంత సమస్యలు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. నాణ్యమైన టూత్ బ్రష్ లను ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. బ్రష్ లను బాత్ రూమ్ లలో పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు. ఈ సమస్య వల్ల కూడా దంతక్షయం ఏర్పడుతుంది.
పళ్లను కనీసం రెండు నిమిషాల పాటు శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.దంతాల మధ్యలో ఏదైనా ఆహారం ఇరుక్కుంటే అది పోయేలా బ్రష్ చేయాలి. పళ్లు తోమిన తర్వాత నాలుకను టంగ్ క్లీనర్ తో శుభ్రం చేస్తే మంచిది. వారానికి ఒకసారి అయినా మౌత్ వాష్ ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.