వాస్తుశాస్త్రం ప్రకారం, మనం ఇంట్లో ఉంచుకునే మన ఇంట్లోని ప్రతి వస్తువుకు శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వస్తువు పాతదైనా, కొత్తదైనా, ప్రతిదీ ఏదో ఒక రూపంలో శక్తిని ఉత్పత్తి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ శక్తులను సానుకూల శక్తి , అలాగే ప్రతికూల శక్తిగా విభజించే ఛాన్స్ అయితే ఉంటుంది.
వాస్తు పరంగా కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా సానుకూల సంకేతాలు ఉంటాయి, వీటితో అంతా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అదే సమయంలో ఇంట్లో నిరుపయోగంగా పడి ఉండే పాత వస్తువులను అలాగే ఉంచుకోవడం వలన, అవి ఇంట్లో ప్రతికూల శక్తులకు ఆవాసంగా మారతాయని తెలుస్తోంది. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైనపుడు అది ఆ ఇంట్లో వారికి చాలా రకాల సమస్యలను కలిగించే ఛాన్స్ ఉంటుంది.
ఈ విధంగా జరగడం వల్ల ఇంటి పురోగతి, శ్రేయస్సుకు హాని కలుగుతుంది.. పనులు ముందుకు సాగవు, అంతా గందరగోళంగా ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబంలో కలహాలు ఎక్కువగా చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.. తరచూ అనారోగ్యాల బారినపడటం లేదా ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఉపయోగం లేని పాత వస్తువులను ఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో ఉంచుకోకూడదని చెప్పవచ్చు.
పాత వార్తాపత్రికలు, పాత తాళాలు, పాత గడియారాలు, పాత పాదరక్షలు, పాత బట్టలు ఇంట్లో ఉండకూడదు. ఇవి ఇంట్లో ఉండటం వల్ల కలిగే నష్టం మాత్రం అంతాఇంతా కాదు. ఇవి ఇప్పటికే ఇంట్లో ఉన్నవాళ్లు వాటిని వెంటనే తొలగిస్తే మంచిది.