పండుగలు ప్రత్యేక రోజులలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఇక ఇటీవల హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్కార్ట్ లో ‘బిగ్ బచత్ ధమాల్ సేల్’ నడుస్తోంది. మార్చి 3 నుంచి మార్చి 5వరకు ఫ్లిప్కార్ట్ లో ఈ హోలీ సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్ కింద ఫ్లిప్‌కార్ట్ వివిధ కేటగిరీల్లో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న డీల్స్ లో లాభదాయకమైన డీల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్. ప్రస్తుతం, ఆపిల్ iPhone 13, iPhone 14 రెండూ ‘బిగ్ బచత్ ధమాల్ సేల్’ సమయంలో భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో Apple iPhone 13 బేస్ మోడల్ ధర రూ.69,900కు 11శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా దీనిపై రెండు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆపిల్ iPhone 14 బేస్ మోడల్ అసలు ధర రూ. 79,900. ఇక సేల్ సమయంలో 9శాతం డిస్కౌంట్ ఉంది. ఐఫోన్ 13 లాగానే రెండు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ (iPhone13) పై11శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు తర్వాత దీని ధర రూ.61,999కి తగ్గుతుంది. అంటే అసలు ధరలో రూ.7901 తక్కువగా ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను గరిష్టంగా రూ. 23వేలకు మార్చుకోవచ్చు. దీంతో రూ.61,999కి ఉన్న దీని ధర రూ.38,999కి తగ్గుతుంది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ HDFC బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేల తగ్గింపు అందిస్తోంది.
ఇక ఆపిల్ iPhone14 అసలు ధర రూ. 79,900. Flipkart lo 9శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తర్వాత దీనిని రూ. 71,999కి పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ. 23వేల తగ్గింపు లభించి రూ. 48,999 కి పొందవచ్చు. మీరు మొత్తం రూ. 23వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను స్వీకరిస్తారని హామీ ఇవ్వలేం. ఎందుకంటే.. మీ ఫోన్ బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు ఫ్లిప్‌కార్ట్ రెండు బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ కొనాలని అనుకునే వారికి ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఈ డీల్స్ ఎంతో ఉపయోగపడతాయి.