మనలో చాలామంది సింపుల్ గా డబ్బు సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్లకు ప్రయోజనం చేకూరేలా ఫ్లిప్ కార్ట్ నుంచి అదిరిపోయే తీపికబురు వెలువడింది. ఫ్లిప్ కార్ట్ కంపెనీకి డెలివరీ పార్ట్‌నర్ కావడం వల్ల సులువుగా ఫ్లిప్ కార్ట్ తో నెలకు 10 లక్షల రూపాయలను సంపాదించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఉత్పత్తులను ఫ్లిప్ కార్ట్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుంది.
ఇంటినుంచి చిన్న బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు ఫ్లిప్ కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. సొంతంగా ఫోర్ వీలర్ ను కలిగి ఉన్నవాళ్లు ఫ్లిప్ కార్ట్ ఫ్రాంఛైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండటంతో పాటు 500 నుంచి 1,500 చదరపు అడుగుల స్థలం ఉన్నవాళ్లు ఈ ఫ్రాంఛైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్రాంచైజీ ఫీజు చిన్న ప్రాంతానికి లక్ష రూపాయలు కాగా పెద్ద ప్రాంతాలకు 5 లక్షల రూపాయలుగా ఉండనుంది. ఈ ఫ్రాంఛైజీకి సంబంధించి అనుమతులు లభించిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడానికి సంబంధించి తగిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫ్రాంఛైజీ తీసుకుంటారో వాళ్లకు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు కూడా అనుమతులు ఉంటాయి.
ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ ను డెలివరీ చేయగలరో వాళ్లకు సులభంగా లాభాలు వస్తాయి. డెలివరీ చేసిన మొత్తానికి సులువుగా కమిషన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. నెలకు 40000 రూపాయల వరకు ఈ వ్యాపారం ద్వారా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ వ్యాపారం బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.