తెల్ల జుట్టును అరికట్టడానికి లేదా దానిని మళ్ళీ నల్లగా మార్చుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సహజ చికిత్సలు, ఆహార మార్పులు, మరియు రసాయన ఆధారిత ఉత్పత్తులు కూడా ఉన్నాయి. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా తెల్ల జుట్టును తగ్గించవచ్చు. మెంతులను నానబెట్టి, ఆ నీటిని జుట్టుకు రాసుకుంటే, తెల్ల జుట్టును తగ్గించవచ్చు.
కాఫీని జుట్టుకు రాసుకోవడం ద్వారా, తెల్ల జుట్టును కొంతవరకు నల్లగా మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. గోరింటాకును పేస్ట్ చేసి జుట్టుకు రాసుకోవడం ద్వారా, జుట్టుకు రంగు వస్తుంది. తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెయిర్ డైలు ఉపయోగించవచ్చు. తెల్ల జుట్టును తగ్గించటానికి ప్రత్యేక షాంపులు కూడా అందుబాటులో ఉన్నాయి. అధిక ఒత్తిడి జుట్టు తెల్లబడటానికి ఒక కారణం కావచ్చు, కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మరియు తగినంత నిద్ర తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు తెల్లబడటానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు, కాబట్టి అన్ని సందర్భాలలో తెల్ల జుట్టును మళ్ళీ నల్లగా మార్చలేము. అయితే కొన్ని రకాల నూనెలను వాడటం ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
నువ్వుల నూనె తెల్లజుట్టుకు దివ్యౌషధంలా పని చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. నువ్వుల నూనె, కరివేపాకు రసం, ఉల్లిపాయ రసం మిక్స్ చేసి మరగబెట్టి ఆ నూనెను అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తెల్ల జుట్టు సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.