ఈరోజే చంద్ర గ్రహణం.. గర్భిణీ స్త్రీలు అస్సలు చెయ్యకూడని తప్పులు ఇవే!

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో హోలీ పండుగను జరుపుకుంటున్నారు. అదే సమయంలో ఈరోజు చంద్ర గ్రహణం కూడా అనే సంగతి తెలిసిందే. సూర్యచంద్రుల మధ్య భూమి వస్తే ఆరోజు చంద్ర గ్రహణం అనే సంగతి తెలిసిందే. గ్రహణం రోజున కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదు. ఈ సంవత్సరం మన దేశంలో గ్రహణం కనిపించదని పండితులు చెబుతున్నారు.

చంద్ర గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బహిరంగ కార్యకలాపాలలో అస్సలు కనిపించకూడదు. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటికే పరిమితమై దేవతల స్తోత్రాలను పఠిస్తే మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత గర్భిణీ స్త్రీలు స్నానం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు సూర్య లేదా చంద్ర గ్రహణాన్ని డైరెక్ట్ గా చూస్తే మాత్రం చెడు ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు.

చిలుకూరు పూజారి రంగరాజన్ మాత్రం ఈరోజు మనకు చంద్ర గ్రహణం లేదని చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుందని యూట్యూబ్ ఛానెళ్లు సంయమనం పాటించాలని భక్తులు ఉన్న భయాలతోనే చస్తున్నారని కొత్త భయాలను సృష్టించవద్దని ఆయన కోరారు. చంద్ర గ్రహణం విషయంలో ఆలయ పూజారి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే గ్రహణ నియయాలను పాటించే వాళ్లు మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. చంద్ర గ్రహణం మరీ ప్రమాదకరం కాకపోయినా గ్రహణం వల్ల నష్టాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. చంద్ర గ్రహణం రొజున చాలా ఆలయాలు మూతబడి ఉంటాయనే సంగతి తెలిసిందే.