డయాబెటిస్ ఉన్నవాళ్లకు మెంతులు వరం.. మెంతుల వల్ల ఏకంగా ఇన్ని లాభాలున్నాయా?

మనలో చాలామంది మెంతుల గురించి తెలిసినా వాటి ద్వారా పూర్తిస్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలను పొందడంలో ఫెయిల్ అవుతున్నారు. తినడానికి చేదుగా ఉండే మెంతులు దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఎన్నో ఔషధాల తయారీలో మెంతులను విరివిగా ఉపయోగిస్తారు. బ్లడ్ షుగర్ లెవల్స్, హై బ్లడ్ ప్రెజర్, యూరిక్ యాసిడ్ లెవల్స్, జుట్టు రాలడం లాంటి సమస్యలకు మెంతులు చెక్ పెడతాయి.

మధుమేహంకు చెక్ పెట్టడంలో మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. మెంతులు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మెంతి కూరను తీసుకోవడం వల్ల కూడా ఈ లాభాలను పొందవచ్చు. న్యూరల్జియా, పక్షవాతం, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి, ఉబ్బరం సమస్యలకు మెంతులు సులభంగా చెక్ పెడతాయని చెప్పవచ్చు.

వాత రుగ్మతలతో బాధ పడేవాళ్లు మెంతులు వాడటం వల్ల ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మెంతులు తీసుకోవడం ద్వారా దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్, ఊబకాయం సమస్యలు సైతం దూరమవుతాయి. ముక్కు నుండి రక్తస్రావం ఇతర ఆరోగ్య సమస్యలను సైతం మెంతులు దూరం చేస్తాయని చెప్పవచ్చు. మెంతులతో తయారు చేసిన టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

భోజనానికి ముందు, రాత్రి సమయంలో నీళ్లు లేదా పాలలో మెంతి పొడిని కలిపి తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. నల్లటి వలయాలు, మొటిమలు, మొటిమల గుర్తులు, ముడతలను మెంతి పేస్ట్ సులువుగా దూరం చేస్తుంది. మెంతులు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి ఒక్కరూ మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.