సాధారణంగా మనం రైల్వే ట్రాక్ కనుక చూస్తే ఇనుప కమ్మీల పక్కన పెద్ద ఎత్తున కంకర పోసి ఉండడం మనం చూస్తుంటాము. ఇలా కంకర పోయడాన్ని అందరూ గమనించినప్పటికీ అసలు రైల్వే ట్రాక్ పక్కన ఈ కంకర ఎందుకు పోస్తారు ఇది వేయడం వల్ల ప్రయోజనం ఏంటి అసలు ఇలా కంకర వేయడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి ఎప్పుడు ఆలోచించి ఉండరు.మరి రైల్వే ట్రాక్ దగ్గర కంకర ఎందుకు వేస్తారు దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయానికి వస్తే…
రైలు ట్రాక్ కింద, చుట్టూ ఉండే కంకర రాళ్లను బల్లాస్ట్ అంటారు. అయితే ఇప్పుడంటే ట్రాక్స్ మధ్యలో కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం చెక్క దిమ్మెలు ఏర్పాటు చేసేవారు. ఇలా రైల్వే ట్రాక్ కు
స్లీపర్స్‌తో ఒకదానికొకటి ఫిట్ చేస్తారు. దాంతోపాటు పట్టాలకు దిమ్మలను కూడా అమరుస్తారు. అయితే ఇలా అమర్చాక ఆ దిమ్మలు, పట్టాలు సరైన పొజిషన్‌లో ఉంటాయి ఇలా కంకర కారణంగా అవి వాటి స్థానం నుంచి కదలిక అనేది లేకుండా స్థిరంగా ఉండిపోతాయి.
ఇక రైల్వే పట్టాల కింద మాత్రమే కాకుండా పక్కన కూడా కంకర పోసి ఉంటారు ఇలా పోయడానికి కూడా కారణం లేకపోలేదు. సాధారణంగా రైల్వే ట్రాక్ కనుక మనం చూస్తే భూమి కన్నా కాస్త ఎత్తు పొజిషన్లో వేసి ఉంటారు.ఏదైనా వర్షం పడినప్పుడు మట్టి కొట్టుకుపోయి రైల్వే ట్రాక్ కూచించకపోకుండా అలాగే రైల్వే ట్రాక్ పక్కన చిన్న మొక్కలు లాంటివి పెరగకుండా ఉండడం కోసము రైల్వే ట్రాక్ ఇరువైపులా కూడా కంకర వేస్తారు తద్వారా అక్కడ ఉన్నటువంటి భూమి కూచించకపోకుండా మొక్కలు పెరగకుండా రైల్వే ట్రాక్ భద్రంగా ఉండడానికి దోహదమవుతుంది.