ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసర వస్తువుగా మారిపోయింది. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్ తో పోటీపడి మరి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కొత్త మోడల్, సరికొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కొనటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు విషయంలో మాత్రం కంగారు కంగారుపడి ఏవి పడితే అవి కొనటం వల్ల నష్టపోవల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటె అంతకన్నా బెటర్ పీచర్స్ తో ఫోన్లు విడుదలవుతాయి. అందుకే ఈ నెలలో ఫోన్ కొనాలి అనుకుంటున్నట్లైతే మీకోసం మార్చిలో విడుదల కాబోతున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ వివరాలు తీసుకొచ్చాం.
• ఐకూ జెడ్7:
లావా పవర్డ్ ఐకూ కంపెనీకి చెందిన ఫోన్లు ఇప్పటికే విడుదలైన మంచి ఫీడ్ బ్యాక్స్ అందుకున్నాయి. ముఖ్యంగా ఈ ఐకూ ఫోన్స్ లో మంచి కెమెరా క్వాలిటీ ఉంటోందని చెబుతున్నారు. ఇప్పుడు ఐకూ కంపెనీ Z సిరీస్ లో మరొక కొత్త ఫోన్ రాబోతోంది. అదే ఐకూ Z7. ఇది దాదాపుగా ఐకూ జెడ్6 ఫోన్ కు లుక్స్, ఫీచర్స్ విషయంలో దగ్గరగా ఉంటుందని సమాచారం. దీనిలో 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 120 హెట్జ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 64 ఎంపీ ఓఐఎస్+ 2+ 2 కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.15 వేలకు లోపే ఉంటుందని తెలుస్తోంది. లో బడ్జెట్లో బెస్ట్ ఫీచర్ ఉన్న ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
రియల్ మీ 10S 5G:
ప్రముఖ స్మార్ట్ ఫోన్ అయినా రియల్ మీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త ఫోన్లన్నీ మార్కెట్లో విడుదల చేస్తోంది. తాజాగా మార్చి నెలలో రియల్ మీ 10s 5జీ రాబోతోంది. దీని ధర రూ.13,500 నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని తెలుస్తోంది. దీనిలో 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అలాగే 8+256జీబీ వేరియంట్ కూడా ఉంటుందని సమాచారం. దీనిలో 6.6 ఇంచెస్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 400 నిట్స్ బ్రైట్ నెస్, 50 ఎంపీ+ 8 ఎంపీ కెమెరాతో అందుబాటులోకి రానుంది.
• శాంసంగ్ గ్యాలెక్సీ F14:
శాంసంగ్ కంపెనీకి చెందిన గ్యాలెక్సీ సిరీస్ లో F14 పేరిట కొత్త మోడల్ మార్చిలో లాంఛ్ కాబోతున్నట్లు సమాచారం. ఎఫ్ 14 లో 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48+ 8+ 2+ 5ఎంపీ కెమెరాలతో అందుబాటులోకి రానుంది. ఇక మార్చి 10న మార్కెట్లోకి విడుదల కానున్నట్లు చెబుతున్నారు. ఇంక దీని ధర విషయానికి వస్తే.. రూ.15 వేలలోపే ఉంటుందని సమాచారం.
• ఒప్పో A58:
ఒప్పో కంపెనీ నుంచి ఏ58 అనే మరొక మోడల్ విడుదల కాబోతోంది. దీని ధర రూ.19,000 నుంచి ప్రారంభం కావచ్చు. దీనిలో మీడియాటెక్ డైమన్సిటీ 700ఏంటీ ఆక్టాకోర్ 8 ప్రాసెసర్, 6 జీబీ+ 128 జీబీ స్టోరేజ్, 6.56 ఇంచెస్ డిస్ ప్లే, 600 నిట్స్ బ్రైట్ నెస్, వాటర్ ప్రూఫ్, ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50+ 2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20 వేలలోపు స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ .