ఏపీలోని గుంటూరు జిల్లా జైలులో డ్రైవర్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. పదో తరగతి చదివి ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండటంతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18500 రూపాయల వేతనం లభించనుంది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది.

సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా జైలు ,తాలూకా కాంపౌండ్, బ్రాడీపేట్, గుంటూరు అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. డ్రైవింగ్ వచ్చిన వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ మొత్తం వేతనం పొందే అవకాశాలు అయితే ఉంటాయి.