సాధారణంగా మనం భోజనం చేసే ముందు అరిటాకులో కనుక భోజనం చేస్తే చాలా మంది అరిటాకుపై నీళ్లు వేయడం మనం చూస్తుంటాము. ఇలా అరిటాకు చుట్టు మూడుసార్లు నీళ్లు వేసుకుని ఎందుకు తింటారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా అరిటాకుపై నీళ్లు వేసుకొని భోజనం చేయడం వెనుక ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ఇలా భోజనానికి ముందు అరిటాకు చుట్టూ వృత్తాకారంలో మూడు సార్లు నీళ్లు చల్లే ఆచారం పురాతన కాలం నుంచి వస్తుంది. ఇలా విస్తర్ల చుట్టూ నీళ్లు చల్లడాన్ని చిత్రాహుతి అని పిలుస్తారు.
ఇప్పటికీ ఈ ఆచార సాంప్రదాయాన్ని పలు బ్రాహ్మణ కుటుంబాలలో ఆచరిస్తూ ఉంటారు. ఇలా విస్తరి చుట్టూ నీళ్లు చల్లడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే పురాతన కాలంలో ఋషులు బ్రాహ్మణులు మొదలైన వారు ఎక్కువగా అడవులలోనే నివసించేవారు అయితే వాళ్లు భోజనం చేయటానికి ఇప్పటిలాగా సరైన వసతులు ఉండేవి కాదు నేలపై కూర్చొని వారు భోజనం చేయాల్సి ఉంటుంది. ఇలా నేలపై కూర్చున్న సమయంలో అరిటాకు నేలను తాకి దుమ్ము చిన్న చిన్న రేణువులు ఆహారంలో కలిసే సూచనలు ఉంటాయి కనుక ఆ దుమ్ము పైకి లేవకుండా ఉండడం కోసం అరిటాకు చుట్టూ మూడు సార్లు నీటిని వేస్తారు.
ఇక రాత్రి సమయంలో భోజనం చేసేటప్పుడు లైట్స్ ఉండేది కాదు కనుక నీటిని అరిటాకు చుట్టు వేయటం వల్ల చిన్న చిన్న కీటకాలు చీమలు ఆ నీటిని దాటి ఆహారంలోకి వచ్చే ప్రయత్నం చేయవు అందుకే అరిటాకు చుట్టు నీటిని వేస్తారు. ఇక ఆధ్యాత్మిక పరంగా ఇలా అరిటాకుపై నీటిని వేసుకుని తినడానికి కారణం మనం దేవుడికి నైవేద్యాన్ని సమర్పించామని తమకు ఆహారాన్ని కల్పించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా నీటిని చిలకరిస్తారని అర్థం.