కలబంద వల్ల కలిగే లాభాలు తెలుసా.. ఇంట్లో ఆ దిక్కున పెడితే ఎన్నో ప్రయోజనాలు!

కలబంద (అలోవెరా) లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో సైతం కలబందను ఉపయోగిస్తారనే సంగతి తెలిసిందే. కలబంద జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు చర్మం మరియు జుట్టును మెరుగుపరుస్తుంది. కలబంద తీసుకోవడం వల్ల మన శరీరంపై ఉన్న గాయాలను సులువుగా నయం చేసే అవకాశాలు అయితే ఉంటాయి.

కలబంద జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లు కలబందలో ఉంటాయనే సంగతి తెలిసిందే. కలబంద చర్మాన్ని మృదువుగా మరియు తేమగా ఉంచుతుందని చెప్పవచ్చు. మొటిమలు, మచ్చలు మరియు చర్మం మంటను తగ్గించడంలో కలబంద సహాయపడుతుంది. కలబంద జుట్టును మృదువుగా మరియు మెరుస్తూ చేయడంతో పాటు చుండ్రును నివారించే అవకాశాలు అయితే ఉంటాయి.

కలబందలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల గాయాలను సులువుగా నయం చేసుకోవచ్చు. వడదెబ్బ నొప్పి నుండి ఉపశమనం కలిగించే విషయంలో కలబంద ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. నోటి పుండ్లు మరియు జలుబు పుండ్లను నయం చేయడంలో కలబంద ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

కీళ్ళ నొప్పులను తగ్గించడంలో కలబందకు ఏదీ సాటిరాదు. పంటి మీద చేరే గారను కలబంద తగ్గిస్తుంది. కలబంద రసం తాగడం వల్ల శరీరంలోని మృత కణాలు సులువుగా తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కలబంద జెల్‌ను చర్మంపై నేరుగా అప్లై చేయవచ్చు. కలబందను వాస్తు నియమాలను పాటిస్తూ ఇంట్లో పెంచితే ఎన్నో ప్రయోజనాలు చేకూరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.