అంతరిక్షం నుంచి భూమికి సురక్షితంగా తిరిగి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు పర్యటన చేయనున్నట్లు సమాచారం. తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన ఆమె, ఇటీవలే స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ క్యాప్సూల్ ద్వారా ఫ్లోరిడా సముద్రజలాల్లో ల్యాండ్ అయ్యారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఆమె, తన కుటుంబ సభ్యులతో సమయం గడిపి, భారత్‌కు వచ్చే అవకాశముందని ఆమె బంధువులు వెల్లడించారు.
Sunita Williams: సునీతా విలియమ్స్.. అంతరిక్ష నౌక భూమపైకి రావడానికి ఎందుకంత కష్టం?
సునీత భూమిని చేరుకున్న వెంటనే గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో సందడి నెలకొంది. గ్రామస్తులు బాణసంచా కాల్చి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఆమె బంధువులు మాట్లాడుతూ, “సునీత త్వరలోనే భారత్‌కు రాబోతోంది. మేమంతా కలిసి ఆమెకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నాం” అని తెలిపారు. అంతేకాదు, ఆమె తన కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక వెకేషన్‌ను ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
Sunita Williams: సునీత విలియమ్స్.. భూమిపైకి ఇలా చేరుకున్నారు!
ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయంగా ఆమెకు లేఖ రాశారు. “భారత్ మీ కోసం ఎదురుచూస్తోంది. మిమ్మల్ని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని పేర్కొన్నారు. సునీతా కూడా గతంలో ఎన్నోసార్లు భారత్‌పై తన ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటూ, కుటుంబంతో సమయం గడిపే పనిలో ఉన్నారు. భారత్ పర్యటనపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.