థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో షుగర్, బీపీ సమస్యలతో బాధ పడుతున్న వాళ్ల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో థైరాయిడ్ తో బాధ పడుతున్న వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఆకస్మిక బరువు తగ్గడం, వేగవంతమైన హృదయ స్పందన, మెడ వాపు, ఎరుపు మరియు వాపు కళ్ళు థైరాయిడ్ వ్యాధి లక్షణాలు అని చెప్పవచ్చు. ఎర్రగా ఉండే చేపలు, నట్స్, తాజా కూరగాయలు, పళ్లు, ఉసిరి, సీతాఫలం తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు థైరాయిడ్‌కు చెక్ పెట్టడానికి సహాయపడతాయని చెప్పవచ్చు. బ్రోకలీ తినడం వల్ల థైరాయిడ్ పనితీరు మెరుగు పడే అవకాశం ఉంటుంది. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పోషకాలు, మంచి కొవ్వులు ఉన్న అవకాడో తీసుకోవడన్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

హార్మోన్ల అసమతుల్యతకు అవకాడో సులువుగా చెక్ పెడుతుంది. గుడ్లు తీసుకోవడం శరీరానికి అవసరమైన సెలీనియం, అయొడిన్ లభించే ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన జింక్ లభించే ఛాన్స్ ఉంటుంది.

మునగాకుతో థైరాయిడ్ కు సులువుగా చెక్ పెట్టవచ్చు. చిన్నచిన్న ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా థైరాయిడ్ ను పూర్తిస్థాయిలో కంట్రోల్ లో పెట్టే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్యతో బాధ పడేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.