ఈ మధ్య కాలంలో నల్ల ఉప్పు వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఉప్పు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి, శరీరానికి కావలసిన ఖనిజాలు లభిస్తాయి మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పులో ఉండే కొన్ని ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి.
నల్ల ఉప్పు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది, ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు. నల్ల ఉప్పు శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది, వేసవిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల ఉప్పులో సోడియం కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అవుతుందని చెప్పవచ్చు.
నల్ల ఉప్పులో గణనీయమైన మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పు లివర్ లో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. నల్ల ఉప్పులో ఉండే కొన్ని ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడతాయి. నల్ల ఉప్పులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
నల్ల ఉప్పులో ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. నల్ల ఉప్పు జలుబు, అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నల్ల ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల పంటి నొప్పి, చిగుళ్లలో సమస్యలు తగ్గుతాయి. నల్ల ఉప్పు గురించి ఎక్కువమందికి అవగాహన లేదు.