కూరగాయల్లో రాజు.. ‘వంకాయ’..! పండించడం కూడా ఈజీనే..!!

‘వంకాయ’ను కూరగాయల్లో రాజు అంటారు. ఎగిరే పావురమా.. సినిమాల్లో వంకాయ కూరలో ఉండే మజా మీద ఓ పాట కూడా ఉంటుంది. నాజూకుగా ఉండే వంకాయను ఎన్ని పద్ధతుల్లో వండినా తినడానికి బాగుంటుంది. ఫంక్షన్ భోజనాల్లో మెయిన్ ఆప్షన్ ‘వంకాయ’. గుత్తివంకాయలో మసాలా వేయించుకుని తింటే ఆ టేస్టే వేరు. వంకాయల్లో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్.. ఎన్నో పోషకాలుంటాయి. వంకాయలు మన భూమిలో ఎక్కువగా పండుతాయి. మన పెరట్లో పెంచుకునే ముఖ్యమైన, అనువైన కూరగాయ ‘వంకాయ’.

Eggplant Farming 1 | Telugu Rajyam

మనకు ఏడాదంతా వంకాయలు కాస్తాయి. పొలంలో పండించే వంకాయకే ఎంతో టేస్ట్ ఉంటే.. మన పెరట్లో పండించే వంకాయకు ఇంకెంత టేస్టు ఉంటుందో ఊహించొచ్చు. కానీ వంకయాల్ని ఎలా పండించాలో చాలా మందికి తెలీదు. వంగ మొక్కలు మట్టి నేలలో బాగా పెరుగుతాయి. అయితే.. రాళ్లు, బురద నేలల్లో కూడా పెరుగుతాయి. మట్టిలో అయితే రాళ్లు లేని మట్టి అయి ఉండాలి. అందులో పొటాషియం స్థాయి 5 నుంచి 6 ఉండేలా చూడాలి. ఎండ తక్కువగా 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య పెంచాలి.

చలి, వేసవికాలంలో వంకాయలు బాగా పెరుగుతాయి. జూన్-జులై మధ్యలో విత్తనాలు నాటితే చలికాలంలో.. డిసెంబర్-జనవరి సమయంలో విత్తనాలు నాటితే వేసవి కాలంలో కోతకు వస్తాయి. హెక్టార్ స్థలంలో 250 నుంచి 375 గ్రాముల విత్తనాలు నాటాలి. మట్టిలో పోషకాలు ఉండాలి. వాటితో  నాలుగైదు వారాల్లో 30వేల నుంచి 45వేల మొక్కలు వస్తాయి. వాటిని మట్టితో సహా బయటకు తీయాలి. మొక్కకూ, మొక్కకూ మధ్య చుట్టూ దూరం 75 సెంటీమీటర్లు ఉండేలా నాటాలి.

విత్తనాల షాపుల్లో లభ్యమయ్యే FYM-25, నైట్రోజన్, పాస్పరస్, పొటాషియం, NPK వంగ మొక్కలకు అవసరం. ఇవేమీ లేకపోయినా.. నీరు ఎక్కువగా పోయకపోయినా పెరుగుతాయి. ఇవి అందిస్తే ఇంకా బాగా పెరుగుతాయి.  కోతకు వచ్చిన వంకాయలను పండక ముందే కోయాలి. హెక్టారుకు 30 నుంచి 50 టన్నుల వంకాయలు పండుతాయి. ఇళ్లలో 10 మొక్కలు వేసినా కావాల్సినన్ని వంకాయలు వచ్చేస్తాయి. 

 

గమనిక: పలు అధ్యయనాలపై నిపుణులు ఆయా సందర్భాల్లో ఇచ్చిన సమాచారాన్నే ఇక్కడ పొందుపరిచాం. ఈ వివరాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన సమాచారం కోసం నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. గమనించగలరు.

 

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles