వేసవికాలం వచ్చేసింది… నీళ్లు తాగే విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారా… సమస్యలు తప్పవు!

200508140810-01-how-much-water-drink-hydrate-wellness

వేసవికాలం వచ్చేసింది వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా మారిపోయాయి ఇలా ఉన్నఫలంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో మన శరీరంలోని నీటి శాతం పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా చాలామంది డిహైడ్రేషన్ కి గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అందుకే వేసవికాలంలో నీళ్లు తాగే విషయంలో ఏ మాత్రం ఆ శ్రద్ధ చూపించకండి అని వైద్యులు చెబుతున్నారు
ప్రతిరోజు నీళ్లను తాగే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది.

సాధారణంగా మనందరం దాహం వేస్తున్నప్పుడు మాత్రమే నీళ్లను తాగడానికి ప్రయత్నం చేస్తాం ఈ అలవాటు సరైనది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనకు దాహం వేస్తుంది అంటే మన శరీరం అప్పటికే భారీగా నీటి శాతాన్ని కోల్పోయిందని అర్థం. మన ఒంట్లో నీటి శాతం తగ్గితే డిహైడ్రేషన్ సమస్య తలెత్తి ఒంట్లో ప్రతి అవయవం పనితీరు దెబ్బతింటుంది దాంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.మనకు దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.

మన శరీరంలో జీవక్రియల సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా నీళ్లు అవసరం ముఖ్యంగా వేసవికాలంలో శరీరంలోని నీటి శాతం మొత్తం చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది కనుక ఎక్కువ నీరు అవసరమవుతుంది.అందుకే దాహం వేసిన వేయకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి గ్లాస్ నీళ్లు తాగడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది. కావున వీరికి 8 లీటర్ల నీళ్లు సరిపోవు అంతకంటే ఎక్కువగా తప్పనిసరిగా తాగాలి.

మన ఒంట్లో నేటి శాతాన్ని అధికంగా కోల్పోయాము అన్న దానికి సూచకంగా మన మూత్రాన్ని పరీక్షించవచ్చు సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అదే మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మనం డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నామని గుర్తించవచ్చు. ఉదయం సాయంత్రం ఎక్ససైజ్ రన్నింగ్ వాకింగ్ వంటి అలవాట్లు ఉన్నవారు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసాన్ని కలిపి సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఏర్పడుతుంది. నీళ్లను తక్కువగా తాగే వారిలో కిడ్నీ ఇన్ఫెక్షన్ తలెత్తి కిడ్నీలో రాళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున మనకు దాహంగా లేనప్పటికీ వీలైనప్పుడల్లా తప్పనిసరిగా ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగడం మంచిది.