ఈ ఆకుల్లో షుగర్ వ్యాధిని నియంత్రించే అద్భుత ఔషధం…. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

మునగ ఆకులు ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉంటూ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట మునగ చెట్టు ఉండడం సహజం. మునగ చెట్టులోని ఆకులు, పువ్వులు, కాండం ,వేర్లు ఇలా ప్రతి భాగంలో మన ఆరోగ్యానికి అవసరమైన ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకులు దివ్య ఔషధం ల పనిచేస్తుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.రక్తంలో గ్లూకోస్ స్థాయిలు విపరీతంగా పెరిగి ఇన్సులిన్ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. దాంతో షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ తగ్గడం వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.షుగర్ వ్యాధి ఒకసారి వస్తే దీన్ని అదుపులో ఉంచుకోవడం తప్ప పూర్తిగా నియంత్రించడం సాధ్యం.

మునగ ఆకులో రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించే క్లోరోజెనిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. కావున దీన్ని ప్రతి రోజు మన ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకుంటే ఇన్సులిన్ వ్యవస్థను మెరుగుపరిచి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మునగాకులో పుష్కలంగా ఉండి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు మునగాకు కషాయం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం మునగ ఆకులను బాగా మరిగించి వడగట్టుకున్న తర్వాత వచ్చిన కషాయంలో రుచి కోసం తేనె, నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేయవచ్చు. అలాగే
మునగాకులో సమృద్ధిగా ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.కాల్షియం పొటాష్ వంటి మూలకాలు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. మునగ ఆకులను ఫ్రై లేదా కూరగా వండుకొనితినవచ్చు. మునగాకు పొడిని తయారు చేసుకుని ఉదయం సాయంత్రం టీ, లేదా సూప్‌లలో కలుపుకొని సేవించవచ్చు.