చక్కెర వ్యాధిని అదుపు చేసే చింతగింజల పొడి.. వైద్యులు ఏమంటున్నారంటే?

చింతపండు మన ఆహారంలో పుల్లని రుచిని ఇవ్వడంతో పాటు మన శరీరానికి అవసరమైన పోషకాలను కూడా సమృద్ధిగా అందిస్తుంది. చింతపండులో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ఔషధ గుణాలు చింత గింజల్లో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చింత గింజల్లో ఉన్న యాంటీ అలెర్జిటిక్ లక్షణాలు మనలో అనేక ఇన్ఫెక్షన్లను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్స్, మినరల్స్,ఎమినో యాసిడ్స్, ఫ్యాటి ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి.కావున ప్రతిరోజు చింత గింజల పొడిని ప్రతిరోజు ఉదయాన్నే పాలల్లో కలుపుకొని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

మన ఇంట్లోనే చింత గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చింత గింజలను దోరగా వేయించిన తర్వాత గింజలను మర పట్టించి మెత్తటి పౌడ రూపంలో మార్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చింత గింజల పొడిని గాజు జార్లో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరించి ప్రమాదకర చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది.

చింత గింజల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో ప్రమాదకర క్యాన్సర్ కణాలు తొలగించి ఉదర క్యాన్సర్,పెద్ద ప్రేగు క్యాన్సర్లను నివారిస్తుంది. చింత గింజల్లో సమృద్ధిగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తపోటు హార్ట్ ఎటాక్ సమస్యలను అదుపు చేస్తుంది. తరచూ కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు చింత గింజల పొడిని పాలల్లో కలిపి సేవిస్తే కీళ్ల కదలికలకు ఉపయోగపడే ద్రవం ఉత్పత్తి అయ్యి కీళ్లనొప్పుల సమస్యను తగ్గిస్తుంది.