మన శరీరంలో అతి ముఖ్యమైన థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరంలో జరిగే ప్రతి జీవక్రియలను సమన్వయపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుత జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాలతో థైరాయిడ్ గ్రంధి పనితీరులో వ్యత్యాసం ఏర్పడుతుంది.
ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా థైరాక్సిన్ హార్మోను సేవిస్తే హైపర్ థైరాయిడిజం అనే వ్యాధి వస్తుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరిగి
బరువు తగ్గడం , గుండె వేగంగా కొట్టుకోవడం, అతిగా చెమటలు పట్టడం, తరచూ విరేచనాలు అవడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
దీనికి భిన్నంగా థైరాయిడ్ గ్రంథి తక్కువ థైరాక్సిన్ హార్మోన్లను శ్రవిస్తే హైపోథైరాయిడిజం అనే వ్యాధికి కారణమవుతోంది. దీని కారణంగా హఠాత్తుగా శరీర బరువు పెరుగుతుంది, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది,విపరీతమైన ఒళ్లు నొప్పులు డిప్రెషన్, మానసిక సమస్యలు, రక్తహీనత, మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి.ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా తలెత్తవచ్చు. ముఖ్యంగా హైపో థైరాయిడిజం జీవితాంతం కొనసాగవచ్చు.కాబట్టి తప్పనిసరిగా వైద్యుల సలహాతో మందులు వాడాలి.
ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో, శారీరక శ్రమ తక్కువగా ఉన్న వారిలో, అయోడిన్ లోపం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడానికి ప్రతిరోజు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక, డాన్స్, క్రీడలు వంటివి తప్పనిసరిగా చేయాలి. అయోడిన్ పుష్కలంగా ఉన్న సముద్రపు చేపలు, క్యారెట్, పాలకూర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు,
రాగులు వంటివి మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.
హైఫో థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజి, ముల్లంగి, కాలీప్లవర్, బ్రకోలి లాంటివి ఆహారంగా తక్కువ తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కెఫిన్ పదార్థం ఎక్కువగా ఉన్న టీ,కాఫీలకు దూరంగా ఉండాలి. ఫైటోఈస్ట్రోజెన్ అధికంగా ఉన్న సోయాబీన్ ను, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్న రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి పై తీవ్ర ప్రభావం పడుతుంది. మానసిక ఒత్తిడి థైరాయిడ్ గ్రంధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం, మ్యూజిక్ తినడం వంటివి తప్పనిసరిగా చేయాలి.