మన జీవితంలో ఆరోగ్యం ఎంతో ముఖ్యం. కానీ ఆరోగ్యం అంటే కేవలం మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే కాదు. నిజంగా ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే నిద్ర చాలా కీలకం. నిద్రను తగ్గించడం వల్ల శరీరానికి, మనసుకు కలిగే నష్టాన్ని ఊహించలేం. మనం రోజంతా ఎంత బిజీగా ఉన్నా, రాత్రి ప్రశాంతమైన నిద్ర లేకపోతే దాని ప్రభావం రోజుపై పడుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, మన శరీరం దాని దైన రిపేర్ సిస్టంను నిద్రపోతున్న సమయంలోనే యాక్టివ్ చేస్తుంది. అంటే హార్మోన్ల విడుదల, కండరాల మలికితనం, మెదడు విశ్రాంతి – ఇవన్నీ నిద్ర సమయంలోనే జరుగుతాయి.
అయితే మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో, దాన్ని తీసుకునే సమయం కూడా అంతే అవసరం. నిద్రలేకపోతే శరీరానికి ఎన్నో రకాల హానికర మార్పులు కలుగుతాయి. రోజుకి కనీసం 7–8 గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఎంత ఉందో ఇప్పటికే చాలా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే తాజాగా వచ్చిన కొన్ని అధ్యయనాలు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాయి.. అది ఏంటంటే తిన్న వెంటనే నిద్రపోతే బరువు పెరగడం ఖాయం.
చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే లేదా రాత్రి అన్నం తిన్న తర్వాత మితిమీరిన అలసటతో పడుకోవాలని చూస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు. అన్నం తిన్న వెంటనే శరీరం ఇంకా జీర్ణ ప్రక్రియలో ఉండే సమయమిది. ఈ సమయంలో నిద్రపోతే శరీరం పూర్తిగా డిజెస్ట్ కాకుండానే శక్తిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అదే కొవ్వుగా మారి శరీరంలో నిల్వ అవుతుంది.
ఈ అలవాటు ఎవరైనా రోజూ కొనసాగిస్తే, కొద్ది రోజులకే బరువు పెరగడం మొదలవుతుంది. పైగా పేగులు సరిగా పనిచేయకపోవడం, మంట, జీర్ణకోశ సమస్యలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు గుంపుగా మారుతుంది. రోజూ ఆరోగ్యంగా ఉండాలంటే తిన్న తర్వాత కనీసం 1.5–2 గంటల గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత నడక లేకపోయినా ఇది ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తిన్న వెంటనే పడుకోవడం అంటే శరీరాన్ని జీర్ణశక్తికి సహాయపడకుండా అడ్డుకోవడమే అని అంటున్నారు.
