శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా…ముఖ్యంగా ఆహారం విషయంలో?

శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మన జీవక్రియ రేటు మందగించి మన రోగ నిరోధక శక్తి పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే శీతాకాలంలో తడి వాతావరణం కారణంగా ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది పైగా మనలో ఇమ్యూనిటీ శక్తి తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదకర సూక్ష్మజీవులు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించుకుంటే తల్లి బిడ్డల ఆరోగ్యం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

గర్భిణీ మహిళలు సాధారణంగానే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మరి ముఖ్యంగా ఈ చలికాలంలో సీజనల్గా వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు,గుడ్డు,వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి
అంతేగాని మనలో చెడు కొలెస్ట్రాల్ను, జీర్ణ వ్యవస్థను పాడు చేసే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. పిజ్జా బర్గర్ నూడిల్స్ వంటి నిసారమైన ఆహారాన్ని ఎక్కువగా తింటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపి తక్కువ బరువుతో జన్మించే అవకాశం ఉంటుంది. అలాగే అయోడిన్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి లేకపోతే పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అధిక ఉప్పు, కారం,మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

గర్భిణీ స్త్రీలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్సు సమృద్ధిగా ఉన్న నారింజ, బత్తాయి, బొప్పాయి, యాపిల్, కివి, వంటి పనులను ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అలాగే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్న గుడ్డు, చేపలు, మాంసం వారంలో ఒకటి లేదా రెండుసార్లు తప్పకుండా తినాలని వైద్యులు చెబుతున్నారు. ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉన్న పాలకూర ,బచ్చలి కూర, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి ఆహారాన్ని ఎక్కువగా తినాలి దాంతోపాటే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింకు సమృద్ధిగా డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా మన ఆహారంలో తీసుకోవాలి థైరాయిడ్ సమస్య ఉన్నవారు అయితే క్యాలీఫ్లవర్ క్యాబేజీ ముల్లంగి బంగాళాదుంపలకు దూరంగా ఉండటం మంచిది.