గర్భిణులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం.. రూ.11,000 పొందే ఛాన్స్!

Pregnant-women-are-have-a-normal-delivery-if-they-follow-these-precautions

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు బెనిఫిట్ కలిగేలా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ ఆ స్కీమ్స్ వల్ల ప్రశంసలను పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పేరుతో కేంద్రం ఒక స్కీమ్ ను అమలు చేస్తుండగ మహిళా సాధికారత లక్ష్యంగా ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు నవజాత శిశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ కోసం 5000 రూపాయల సాయం అందనుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. మొదటి విడతలో 1000 రూపాయలు, మిగతా రెండు విడతలలో 2000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది.

రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే కేంద్ర ప్రభుత్వం మరో 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం లేదా సమీపంలోని ఆశ కార్యకర్తను కలవడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఈ స్కీమ్ కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

అంగన్ వాడీ కేంద్రం ద్వారా కూడా ఈ స్కీమ్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతో పాటు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. గర్భిణులకు ఈ స్కీమ్ అద్భుతమైన స్కీమ్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.