చక్కెర వ్యాధిని డయాబెటిస్, షుగర్ ,మధుమేహం అని కూడా అంటారు. చక్కెర వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక సందర్భాల్లో హెచ్చరించిన విషయం మనందరికీ తెలిసిందే. చక్కెర వ్యాధికి ప్రధాన కారణాలు రోజు రోజుకు మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యు సంబంధిత కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది వారి నిర్లక్ష్యం వల్లే చక్కర వ్యాధికి గురవుతున్నారు.
మన రోజువారి ఆహారంలో అధిక క్యాలరీలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఉన్న జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్ ను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోస్ స్థాయిలు మోతాదుకు మించి చేరడం వల్ల చక్కెర వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో ఎటువంటి శారీరక శ్రమ లేకపోవడంతో శరీరంలోని కార్బోహైడ్రేట్స్ రక్తంలో చేరి గ్లూకోస్ స్థాయిలను పెంచడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తుంది. చక్కర వ్యాధి ముప్పు నుంచి తప్పించుకోవడానికి మన రోజువారి ఆహారం లో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
100 గ్రాముల వైట్ రైస్ లో 0.4 గ్రాముల ఫైబర్ ఉంటే, బ్రౌన్ రైస్ లో 1.8 గ్రాములు ఉంటుంది. వైట్, బ్రౌన్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ పరంగా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కాకపోతే బ్రౌన్ రైస్ లో అత్యధికంగా ఫైబర్ ఉండడం వల్ల క్యాలరీలు తొందరగా రక్తంలో చేరవు దాంతో రక్తంలోనీ గ్లూకోస్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కావున ప్రతిరోజు 30 గ్రాముల ముడి బియ్యాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. 30 గ్రాముల రైస్ నుంచి 20 గ్రాముల క్యాలరీలు లభిస్తాయి.30 గ్రాముల గోధుమపిండి చపాతీతో పోలిస్తే 30 గ్రాముల రైస్ వల్లే రక్తంలో ఎక్కువ గ్లూకోస్ నిల్వలు పెరుగుతాయి. కావున చక్కర వ్యాధిగ్రస్తులు అత్యధిక ఫైబర్ ఉన్న గోధుమ రొట్టెలను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. చక్కెర వ్యాధిగ్రస్తులు చిరుధాన్యాలు, పండ్లు కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకుంటే వీరికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి.