గాసిప్స్ : సాయి పల్లవితో ఫస్ట్ టైం రామ్ చరణ్? ఏ ప్రాజెక్ట్ కోసం అంటే.?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇండియన్ సినిమా దగ్గర ఒక హాట్ కేక్ లా మారాడు. తన గత సినిమా ట్రిపుల్ ఆర్(RRR) దెబ్బతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మరో టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో RC 15 అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా తర్వాత నెక్స్ట్ జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయనున్నాడు. అయితే ఇది ఆల్ మోస్ట్ ఆగింది అన్నట్టు రూమర్స్ బయటకి వినిపిస్తుంది. కన్నడ దర్శకుడు నర్తన్ అయితే చరణ్ ని ఇంప్రెస్ చేసాడని కొన్ని రూమర్స్ ఇపుడు స్టార్ట్ అయ్యాయి.

మరి ఈ సినిమాతోనే చరణ్ ఫస్ట్ టైం లేడీ పవర్ స్టార్ సాయి పల్లవితో కనిపించనున్నాడని గాసిప్స్ బయటకి వచ్చాయి. అయితే ఈ సినిమాకి మొదట పూజా హెగ్డే పేరు కూడా పరిశీలనలోకి రాగా ఆమెతో పాటు సాయి పల్లవి పేరు కూడా ఉందని ఇప్పుడు సినీ వర్గాల్లో మరో టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్టయ్యిందా లేదా అనేది చూడాలి.