Love Story Re-Release: నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ ఫిబ్రవరి 14న రీ-రిలీజ్

Love Story Re-Release: యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్‌లో మరపురాని మైల్ స్టోన్ మూవీ ‘లవ్ స్టోరీ . ఈ చిత్రంలో నాగ చైతన్య తెలంగాణ గ్రామానికి చెందిన ఫోక్ డాన్సర్‌గా పూర్తిగా కొత్త పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల చైని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో చై తన నటనలోని భావోద్వేగాల అందరినీ హత్తుకున్నాయి. ఆయన నటనకు విమర్శకులు, ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు.

హీరోయిన్ గా సాయి పల్లవి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. చైతన్య–సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, కుల–వర్గ భేదాలను దాటిన ప్రేమ కథను మరింత హృదయాన్ని తాకేలా చేసింది. గ్రామీణ తెలంగాణ జీవనశైలిని నిజాయితీగా, సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సంగీత దర్శకుడు పవన్ అందించిన అందించిన నీ చిత్రమ్ చూసి, సారంగ దరియా సినిమా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్స్‌గా మారాయి. ఇప్పటికీ అన్ని ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండ్ అవుతున్నాయి.

ఇప్పుడు, మేకర్స్ ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ సాగా ఫిబ్రవరి 14న – ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు

కోవిడ్ కాలంలో, 2021లో విడుదలైన ఈ చిత్రం సవాళ్లను దాటుకొని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. SVCLLP , Amigos Creations బ్యానర్లపై నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని ఒక ప్రేమకావ్యంగా తీర్చిదిద్దారు.

ఇప్పుడు వాలెంటైన్స్ డే రోజున లవ్ స్టొరీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. చైతన్య–సాయి పల్లవి అభిమానులు సినీ ప్రేమికులు ఈ ఆల్-టైమ్ క్లాసిక్ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఆస్వాదించేందుకు గెట్ రెడీ.

Public Reaction On Ys Jagan Comments On Chandrababu || Ap Public Talk || Pawan Kalyan ||TeluguRajyam