గాసిప్స్ : విజయ్ దేవరకొండ లైనప్ లోకి పవన్ భారీ హిట్ దర్శకుడు వచ్చాడా?

ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల్లో హిట్స్ సహా భారీ డిజాస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలనాటి చిత్రాల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఏక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “లైగర్” కూడా ఒకటి.

మరి ఈ సినిమా పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ పెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రిలీజ్ తర్వాత పూరి కెరీర్ ఏమో కానీ హీరో విజయ్ దేవరకొండ కొంచెం సేఫ్ అనే చెప్పాలి.

అయితే విజయ్ లైనప్ లో ఆల్రెడీ స్టార్ దర్శకులు కొందరు ఉండగా ఇప్పుడు ఓ క్రేజీ గాసిప్ సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. ఈసారి విజయ్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి లేటెస్ట్ గా వచ్చిన సమాచారం.

దీనితో ఈ కాంబో ఊహించనిదే అని చెప్పాలి. మరి పవన్ తో ఆల్రెడీ గబ్బర్ సింగ్ అనే భారీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఇప్పుడు మళ్ళీ పవన్ తో “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేయనున్నాడు. మరి ఇలాంటి దర్శకునితో విజయ్ సినిమా అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పై అసలైన అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.