వైసీపీ కొత్తగా ఏమీ కనుగొనలేదు కదా.! వైసీపీ బెంబేలెత్తిపోయేంతలా రాజకీయ పరిణామాలేమీ మారిపోలేదు కదా.! వై నాట్ 175 అనేది వైసీపీ నినాదం. టీడీపీ – జనసేన విడివిడిగా వస్తే, 175 గెలుస్తాం.. కలిసొచ్చినా 175 గెలుస్తాం.. అని వైసీపీ ఇప్పటిదాకా చెబుతూ వచ్చింది.
అలాంటప్పుడు టీడీపీ – జనసేన కలవడంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇతరత్రా నేతలు.. దాదాపు అందరూ మీడియా ముందర క్యూ కట్టేశారు. పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీ స్టార్ అన్నారు. చంద్రబాబుని దొరికిన దొంగ అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి విమర్శల్ని జనం వినీ వినీ విసిగిపోయారు.
‘అక్కడికేదో మీ పార్టీ పత్తిత్తు కాదు కదా..’ అని జనం వైసీపీని చీత్కరించుకునే పరిస్థితి వచ్చేసింది. సింపతీ విషయంలో చంద్రబాబు, వైఎస్ జగన్ ఒకటే ఇప్పుడు. ఆ మాటకొస్తే, వైఎస్ జగన్ మీద పాత సింపతీ.. అది ఫేడవుట్ అయిపోయింది. చంద్రబాబు మీద కొత్తగా సింపతీ క్రియేట్ అయ్యింది.
దీనికి అదనంగా, పవన్ కళ్యాణ్‌కి ఓ అవకాశమిచ్చి చూద్దాం.. అన్న అభిప్రాయం, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనంలో పెరిగింది. దీనంతటికీ కారణం ఎవరు.? ముమ్మాటికీ వైసీపీనే. సజ్జల రామకృష్ణారెడ్డి కావొచ్చు, మరొకరు కావొచ్చు.. జనసేనను ఇంత సీరియస్‌గా తీసుకుని వుండకూడదు.
హైద్రాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తున్న పవన్ కళ్యాణ్‌ని అడ్డుకుని వైసీపీ చాలా పెద్ద తప్పు చేసేసింది. ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా.. వైసీపీ చేసిన అత్యంత ఘోరమైన తప్పిదమిది. ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇదే జగన్ పాలనకు అంతం.. అని అనాల్సి వస్తే అందులో వింతేమంది.?
కూర్చున్న కొమ్మని వైఎస్ జగన్ నరుక్కున్నారా.? మునగ చెట్టు ఎక్కించి వైఎస్ జగన్‌ని వైసీపీ నేతలే కిందన పడేస్తున్నారా.? రెండూ రైటే.! వైసీపీ ఇంత కవరేజ్, టీడీపీ – జనసేనకు ఇచ్చి వుండకపోతే వ్యవహారం వేరేలా వుండేది. వైసీపీ స్వయంకృతాపరాధం.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అశనిపాతమే.!