Revanth Reddy: కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలకెత్తనివ్వం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఇందిరాగాంధీ 107 వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నేడు ఈ కార్యక్రమాన్ని ఆడబిడ్డలకు అంకితం చేసామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మరోసారి మొలకెత్తనివ్వం అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాసి పెట్టుకోండి, కేసీఆర్ కాస్కో అంటూ సవాల్ విసిరారు. నీ కష్టం ఏందో.. నీ బాధ ఏందో అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం అంటూ కెసిఆర్ కు సవాల్ విసిరారు.

అసెంబ్లీలో నువ్వు చెప్పేది మంచి విషయాలు అయితే కచ్చితంగా మేము ఆ విషయాలను వింటాము అలాగే ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తామని తెలిపారు. మీరు మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటకు రారు గాని ఇద్దరు చిల్లరగాళ్లను రోడ్డుపైకి వదిలావు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.ఓరుగల్లు ఆడబిడ్డ (కొండా సురేఖ)కు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేసింది ఆడబిడ్డనే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా ఓ ఆడబిడ్డ ఉన్నారు. ఇది ఆడబిడ్డల ప్రభుత్వమని గర్వంగా చెప్పుకుంటాం అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. మేం చేసిన పనులన్నింటికీ నేడు కాంగ్రెస్ వచ్చి కొబ్బరికాయ కొడుతుంది అంటూ ఓ వ్యక్తి మాట్లాడుతున్నారు. పదేళ్లుగా కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేయనప్పుడే మీ బుద్ధి బయటపడింది. మీరు చేయలేదు కాబట్టే.. మేం పూర్తి చేసామంటూ రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.