Vijay Sai Reddy: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య మొదలైన వివాదం తారస్థాయికి చేరుకుంది. ఇలా ఒకరిపై మరొకరు సవాల్ విసిరితో చాలెంజులు చేస్తున్నారు. ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఎడిటోరియల్ పేజీలో రాసే తన వ్యాసంలో విజయసాయి రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇటీవల కాలంలో ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అయితే ఆయన బహిరంగంగా నా గురించి విమర్శలు చేసి నాలుగు గోడల మధ్య నాకు వివరణ ఇవ్వడం కాదు నాతో బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు అయితే ఈ విషయంపై విజయ్ సాయి రెడ్డి స్పందించి రాధాకృష్ణకు ప్రతి సవాల్ చేశారు.
ఎక్స్ వేదికగా ఆర్కేకు విజయసాయిరెడ్డి ప్రతి సవాల్ విసురుతూ.. ఆర్కే బహిరంగ సభకు నేను సిద్ధమే.. నీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను ఫేస్ టు ఫేస్ కౌంటర్ కు ఎన్కౌంటర్ కు నేను సిద్ధమే నువ్వు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా? ఢిల్లీలో ఎన్జీవోలు.. మేధావులు.. జర్నలిస్టులు.. అన్ని టీవీ చానల్స్ ను అందరిని ఆహ్వానిద్దాం.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీలో నువ్వు ఉండే ప్యాలెస్ గురించి అలాగే నేను ఉండే రెంట్ ఇల్లును కూడా చూపిద్దాము అలాగే 100 ఎకరాలు కోట్ల విలువ చేసే స్థలం.. దాన్లో ఇంకో రూ.200 కోట్లతో కడుతున్న ఆఫీస్ భవంతిని పరిశీలిద్దాం. రాధాక్రిష్ణ.. నీ పత్రిక.. టీవీని ఏ పునాదులపై ఏర్పడిందో మర్చిపోవద్దు ఇప్పటికి కూడా నువ్వు నీ ఛానల్ కోసం తరచూ అమెరికా వెళ్తూ ఎన్ఆర్ఐ వద్ద చందాలు వసూలు చేస్తున్నడం నిజం కాదా.కలర్ బ్లైండ్ నెస్ లా నీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగితావాళ్లంతా నీవేం అన్నా పడాలా అంటూ విజయసాయిరెడ్డి రాధాకృష్ణకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ప్రతి సవాల్ ను స్వీకరిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.