Revanth Reddy: హనుమకొండలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మహిళలందరూ సంతోషంగా ఉన్నారని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి మహిళను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత మన మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలకు పెద్దపీట వేసామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహిళ నియమింపబడ్డారని ఇది మహిళల ప్రభుత్వమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయామంలో ఒక మహిళ మంత్రి కూడా లేరని ఈయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందని అయితే ఇలా అభివృద్ధిని అడ్డుకోవడానికి బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తే కనుక వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.
వరంగల్ లో కాళోజీ కళాక్షేత్రాన్ని కట్టడానికి పదేళ్లైనా కేసీఆర్ కు చేతులు రాలేదని విమర్శించారు. ఎంతో పట్టుదలతో మా ప్రభుత్వం పూర్తి చేసిందని వెల్లడించారు. వరంగల్లో హైదరాబాద్ కి పోటీగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు..ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తే ఊచలు లెక్కబెడతారన్నారు. అక్రమ సంపాదనతో కిరాయి మనుషలను తెచ్చి కుట్రలు చేస్తే కచ్చితంగా జైలుకు పంపిస్తానని రేవంత్ తెలియ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ ఉద్యోగం ఊడిపోతే ఏడాదిలో పై 50వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. అలాగే రైతులకు రెండు లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ జరిగిందని చిన్నచిన్న లోపాలు ఉన్నవారికి కూడా త్వరలోనే మాఫీ అవుతుందని వెల్లడించారు. కెసిఆర్ వ్యవహార శైలి అధికారంలో ఉంటే దోచుకుటం లేకుంటే ఫామ్ హౌస్ లో పడుకుంటాం అనే విధంగా ఉందని బిఆర్ఎస్ నాయకులపై రేవంత్ ఫైర్ అయ్యారు.