Meenakshi Chowdary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న ఈమె త్వరలోనే విశ్వక్ సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాఖీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె మెకానిక్ రాఖీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా మీనాక్షి చౌదరి అక్కినేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుందంటూ వార్తలు హల్చల్ చేశాయి.
ఈమె అక్కినేని హీరో సుశాంత్ తో ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసినప్పటికీ వీరిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే వీరు ఇద్దరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై మీనాక్షి చౌదరి స్పందించారు. సోషల్ మీడియాలో నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని ఈమె క్లారిటీ ఇచ్చారు.
మొదట్లో నా పెళ్లి గురించి వచ్చిన ఆ వార్తలను చూసి నేను కూడా షాక్ అయ్యానని తెలిపారు..ఇటీవల తనపై తరచూ ఇలాంటి రూమర్సు స్ప్రెడ్ అవుతున్నాయని, గతంలో ఓ తమిళ హీరోని పెళ్లి చేసుకోబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని , ఇలా ప్రతి నెల ఏదోక రూమర్ వస్తూనే ఉంది అంటూ ఈమె తన గురించి వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.