AP Politics: వాలంటీర్ వ్యవస్థపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఇక వాలంటీర్ వ్యవస్థ లేనట్టేనా?

AP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడం కోసమే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు ఇలా వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలని అందించారు.

ఇలా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూనే వారికి గౌరవ వేతనంగా 5000 రూపాయలను గత ప్రభుత్వం ఇచ్చేది అయితే మొదట్లో వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొనసాగుతుందని అయితే ప్రస్తుతం ఇస్తున్న ఈ 5000 కాస్త పదివేల రూపాయలు చేస్తూ గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే విషయంపై పెద్ద సంధిగ్దత నెలకొంది. ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలాంటి ప్రకటన లేదు అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసే పింఛన్లను సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. తాజాగా వాలంటీర్ వ్యవస్థ గురించి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి శాసనమండలిలో కీలక ప్రకటనలు చేశారు.

గత ప్రభుత్వంలో నియమించిన వాలంటీర్లను వైకాపా ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో రాజీనామా చేయించి నమ్ముకున్న ప్రజలను, నాయకులను కూడా మోసం చేసింది అంటూ మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మరి ఎన్నికల సమయంలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందించి ఈ వ్యవస్థను కొనసాగిస్తామని ఎందుకు హామీ ఇచ్చారు అంటూ ప్రశ్నించారు.