Pawan Kalyan: మహిళలు కిడ్నాప్ పై పవన్ సంచలన ట్వీట్.. రాష్ట్ర ప్రజల స్పందన ఇదే?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో మిస్సయిన 30 వేల మంది మహిళల అదృశ్యంపై మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్లు మహిళల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయటం వల్ల 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ క్రమంలోనే పవన్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో వాలంటీర్లు అలాగే ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలియజేశారు. వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అదే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళకు రక్షణ కల్పించే బాధ్యత తనదని పవన్ కళ్యాణ్ అప్పట్లో భరోసా ఇచ్చారు. ఇక గత జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది.

ఇకపోతే తాజాగా గత ప్రభుత్వ హయాంలో అదృశ్యమైన మహిళల గురించి పవన్ తాజాగా ట్వీట్ చేశారు. గత ప్రభుత్వ హయామంలో 30000 మందికి పైగా మహిళలు అదృశ్యమైతే జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈయన తెలిపారు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మిస్సింగ్ కేసులు తగ్గాయని అలాగే ఇప్పటివరకు అదృశ్యమైన 18 మంది మహిళల ఆచూకీ తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.

హోం మంత్రి నేతృత్వంలో టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేసి ఇలాంటి కేసులను చాలా సునాయసంగా పరిష్కరించినట్లు తెలిపారు. ఇలా పోలీస్ వ్యవస్థకు ఈయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.
గత ప్రభుత్వ హయాంలో 30000 మంది మిస్ అయ్యారని అప్పుడు ఇప్పుడు చెబుతున్న పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారు. ఎందుకు వారిని వెనక్కి తీసుకురాలేకపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అద్భుతంగా పనిచేస్తుంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలా మహిళలకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఎక్కడ అంటూ మరికొందరు ప్రశ్నించగా మరికొందరు ఆ నిందితులకు బెయిల్ ఎందుకు ఇచ్చారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.