Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో కొనసాగే వారు ప్రేమలో పడటం సర్వసాధారణం అయితే ఒక రెండు సినిమాలలో కంటిన్యూగా ఓకే హీరో హీరోయిన్లు కలిసిన నటిస్తే తప్పనిసరిగా వారిద్దరు ప్రేమలో ఉన్నారని అందరూ భావిస్తూ ఉంటారు. ఇలా గీతాగోవిందం సినిమా ద్వారా హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్ దేవరకొండ రష్మిక. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా నటించారు అయితే గీత గోవిందం సినిమాలో వీరిద్దరి నటన చూసిన ఎంతోమంది వీరు నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని భావించారు.
ఈ వార్తలకు అనుగుణంగా వీరిద్దరూ కూడా కలిసి వెకేషన్ లకు వెళ్లడం ఓకే ఇంట్లోనే ఉండటం వంటివి జరిగింది. ఇలా వీరిద్దరూ వేరువేరుగా ఫోటోలు షేర్ చేసిన వీరి బ్యాగ్రౌండ్ లోకేషన్ ఒకటే ఉండడంతో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తున్నారని స్పష్టంగా అర్థమైంది ఇలా పలు సందర్భాలలో వీరి రిలేషన్ గురించి వార్తలు వచ్చిన వీరు మాత్రం ఆ వార్తలను ఖండిస్తూనే ఉన్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని స్పష్టమవుతుంది. ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది తప్పని సరిగా పుడుతుంది అబ్బాయిలు మీరు ఇంకా చాలా యంగ్ గా ఉన్నారు కాబట్టి కాస్త సమయం ఇవ్వండి ముందు మీరు పురుషులుగా ఎదగండి.
లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్నవారికంటే బెటర్‌గా ఆలోచిస్తారు. ఇది నా పర్సనల్ అనుభవం. 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు మనం అస్థిరంగా ఉంటాం. ఏది డిసైడ్ చేసుకోలేం. సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. ఏది ఫోర్స్‌గా చేయకండి అంటూ ఈయన ప్రేమ గురించి మాట్లాడటంతో ఈయన తప్పనిసరిగా రష్మిక ప్రేమలో ఉన్నారని అందుకే ప్రేమ గురించి ఇలా ఓపెన్ కామెంట్స్ చేశారు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Love will happen,you guys are young, give it time
First of all men need to grow
#VijayDeverakonda @TheDeverakonda pic.twitter.com/r4zFPDYScg
— Suresh PRO (@SureshPRO_) November 19, 2024