రాజకీయాలూ, సినిమాలూ వేర్వేరు కాదు. ఎన్నికల సీజన్ వస్తోంది. ఆయా రాజకీయ పార్టీలకు అనుకూల వ్యతిరేక సినిమాలు రావడం మామూలే.
ఈ నేపథ్యంలో ఓ యంగ్ డైరెక్టర్ని ఇటీవల ఓ ప్రధాన రాజకీయ పార్టీ సంప్రదించింది. ఆ డైరెక్టర్ సదరు పార్టీకి చాలా సానుభూతిపరుడు. గతంలో ఆ పార్టీ పెద్దపై ఓ సినిమా తీసి పాపులర్ అయ్యాడు.
ఆ యాంగిల్లోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా సినిమా తీయాలని సదరు రాజకీయ పార్టీ కోరగా, తాను చేయలేనని చెప్పేశాడట ఆ యంగ్ డైరెక్టర్.
కావాలంటే మన పార్టీకి అనుకూలంగా సినిమా చేయగలను కానీ, ఇంకొకరికి వ్యతిరేకంగా చేయలేనని తెగేసి చెప్పేశాడట. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అనలేం కానీ, పవన్ సిద్ధాంతాలను బాగా ఇష్టపడే ఆ యంగ్ డైరెక్టర్ ఇంత నిక్కర్చిగా చెప్పేయడంతో, ఇప్పుడీ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అన్నట్లు ఈ మధ్య ఓ బోల్డ్ వెబ్ సిరీస్ తీసి, విమర్శల పాలయ్యాడీ యంగ్ డైరెక్టర్.