AP: మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్… అప్పుడే ప్రమాణ స్వీకారం!

AP: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు దక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా జనసేన పార్టీ వ్యవహారాలను చూసుకుంటూ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న నాగబాబుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉన్నత పదవి దక్కుతుందని అందరు భావించారు. అయితే ఈయనకు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదని స్పష్టమైనది ఇక రాజ్యసభకు వెళ్తారని కూడా వార్తలు వినిపించాయి.

ఇక రాజ్యసభకు కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంతో ఈయనని ఏపీ క్యాబినెట్ లోకి మంత్రిగా తీసుకోబోతున్నట్లు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. దీంతో ఈయనకు ఏ మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా నాగబాబు మంత్రి పదవిని అందుకోవడంతో ఈయన ఎప్పుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ అయ్యారు అయితే ఈ భేటీలో భాగంగా పలు అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక తన అన్నయ్య నాగబాబు ప్రమాణస్వీకారం సంక్రాంతి పండుగ తర్వాత జరగబోతుందనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సంక్రాంతి తర్వాత తేదీని ప్రకటిస్తే ఈ విషయాన్ని గవర్నర్ కి సమాచారం అందజేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక సంక్రాంతి పండుగ తర్వాత మంత్రిగా నాగబాబు బాధ్యతలను అందుకోబోతున్నారు.

ఇక ఈ భేటీలో భాగంగా వైకాపా నుంచి వలసలుగా కూటమిలోకి వస్తున్నటువంటి నేతల గురించి కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. వివాదాస్పద నాయకులను చేర్చుకుంటే అన్ని పార్టీల క్యాడర్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తున్నందున ఇప్పుడల్లా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం. ఇలా కొంతకాలం సైలెంట్ గా ఉండి అనంతరం పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.