యనమల మేధావేమి కాదు … దిగజారుడు రాజకీయమే!

Yanamala Ramakrishnudu

గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చిన కోవిడ్ (కరోనా) నిధులపై శ్వేత పత్రం సమర్పించాలని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అనడం చూస్తే అనేక సామెతలు ఒకేసారి గుర్తుకొస్తున్నాయి. ఆర్ధిక నిపుణుడని, న్యాయ కోవిదుడని పొగిడించుకునే యనమలకు ఏ జ్ఞానమూ లేదని ఈ ఒక్క ప్రకటనతో అర్ధమవుతుంది. మహమ్మారిగా కరోనా విరుచుకుపడుతున్న తరుణంలో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరు ఇటువంటి ప్రకటనలు చేయరు. కుటుంబసభ్యుడొకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతని బాగోగులు  చూస్తున్న వారిని వైద్య ఖర్చుల లెక్కలు అడిగితే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే అమానవీయంగా ఉంది. కరోనా తాకిడికి ప్రభుత్వ యంత్రాంగం తల్లడిల్లుతోంది. వైద్యులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు. ఇటువంటి సీరియస్ పరిస్ధితుల్లో మంచి సలహాలు ఇవ్వాల్సింది పోయి అతి చిల్లర వ్యాఖ్యానాలు చేయడం మాజీ ఆర్ధిక మంత్రికి తగదు.

Read More : సుషాంత్ సింగ్ ని దావూద్ ఇబ్ర‌హీం చంపేసాడు!

వైట్ పేపర్ (శ్వేతపత్రం) కు అసలైన అర్ధం యనమల కే కాదు,  చాలా మందికి తెలియదు. అది వారి తప్పు కాదు. శ్వేతపత్రానికి స్పష్టత లేని ఒక అర్ధం స్ధిరపడిపోయింది. శ్వేత పత్రమంటే లెక్కల పత్రం కాదు.  నాయకుల నోటినుండి శ్వేతపత్రం (WHITE PAPER) విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అనే మాట విటుంటాం. వారు డిమాండ్ చేసే తీరు చూస్తుంటే అసలీ శ్వేతపత్రం అంటే ఏంటో తెలిసే వారు ఆ మాట ఉపయోగిస్తున్నారా అనే అనుమానం కలుగుతున్నది. ఎందుకంటే  శ్వేతపత్రమనేది ప్రభుత్వం ఒక శాసనం తెద్దామనుకున్నపుడు దానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగా ప్రజలకు తెలియచేసే ది. ఈ   పత్రాన్నే  శ్వేతపత్రం అనాలి .  ఈ పత్రంలో ఉన్నదే సదరు శాసనం లో ఉండాలని లేదు. మార్పులు చేర్పులు తొలగింపులు ఆ శాసనంలో చోటుచేసుకోవచ్చు. ఇంకోటేంటంటే ఇది ఒక సంక్లిష్ట సమస్యపై అధికారిక నివేదిక , దర్శిని. దానిలో ఆ సమస్యపై ఆ పత్రాన్ని ప్రకటించినవారి వైఖరి ఉంటుంది. దానిని పాఠకులు అర్ధంచేసుకుని పరిష్కారమార్గాలు చూపటమో తమ నిర్ణయాన్ని ప్రకటించటమో చేస్తారు. కానీ మన నాయకులు ప్రభుత్వాలు చేపట్టిన కొన్ని  పథకాలు , కార్యక్రమాల వివరాలు వాటికి కేటాయించిన నిధులు వాటి ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంటారు.

Read More : షాకింగ్ వీడియో: నిత్యా లెస్బియ‌న్‌గా చెల‌రేగిందే

ఈ 73 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వమైనా ఒక ప్రాజెక్టు గురించో పథకం గురించో శ్వేతపత్రం విడుదల చేసిన దాఖలా లేదు.  ప్రపంచంలో తొలిసారిగా పాలస్తీనా లో యూదుల నివాసం పై నాటి బ్రిటన్ ప్రభుత్వంలోని వలస ప్రాంతాల మంత్రి విన్ స్టన్ చర్చిల్ 1922 లో శ్వేత పత్రం ప్రకటించాడు. ఇక మనదేశంలో జమ్మూ కాశ్మీర్ వివాదంలో తన వైఖరిని వివరిస్తూ భారత ప్రభుత్వం 1948 లో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావును పదవీచ్యుతుణ్ణి  (ఇదే యనమల మాయాజాలంతో) చేసి, ముఖ్యమంత్రి  పీఠం ఎక్కాక చంద్రబాబు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటూ కొత్తగా పన్నులు వేయాలని చెప్పి తన చర్యను సమర్ధించుకోవటానికి, తనపై విమర్శలు రాకుండా చూసుకోవటానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై 1996 లోనో ఏమో బాబు ‘శ్వేతపత్రం’ వంటి దానిని  ప్రకటించాడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరూ ఆ పని చేసినట్లు లేదు.

Read Moreవిశాఖ ప్ర‌మాదాల‌పై విజ‌య‌సాయి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైట్ పేపర్ వంటి సాంకేతిక అంశాన్ని పక్కన పెట్టి  మాట్లాడుకుంటే…. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు తెలుగుదేశం ప్రభుత్వం తన హయాంలో ఎన్ని శ్వేతపత్రాలు విడుదల చేసింది? అమరావతిలో రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన  నిధులపై పేపర్ సమర్పించారా? పోలవరం నిధులకు స్పష్టమైన లెక్కలు చెప్పారా? అంత వరకు ఎందుకు ? రాజధాని గ్రాఫిక్స్ ఇచ్చి అరచేతిలో సినిమా చూపించిన రాజమౌళికి ఎంత ఇచ్చారో, ఇవ్వకపోతే ఏ భూములు వాగ్దానం చేశారో గత ఆర్ధిక మంత్రి లెక్కలు చెప్పగలరా? శ్వేతపత్రం అంటే సామాన్యుల భాషలోనే…. వివరంగా లెక్కలు చెప్పడం ….అనుకుందాం. మరి గత కాలపు ఆ లెక్కల వివరాలెక్కడ?

యనమల స్టేట్ మెంట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన అతి సుతి మెత్తగా ఖండించారు. యనమల వంటి అతి మామూలు, నేలబారు రాజకీయ నాయకుడికి కౌంటర్ ఇవ్వడానికి తమిళ మహాకవి వాక్యాలను బుగ్గన కోట్ చేశారు. యనమలకు అంత అవసరం లేదు. నాలుగు నాటు సామెతలను ప్రయోగించి ఉండాల్సింది. కోవిడ్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాగానే పనిచేసిందనడానికి అధిక సంఖ్యలో కోవిడ్ టెస్టులు జరగడం ఒక ఉదాహరణ. కోవిడ్ నిధుల లెక్కలు చెప్పుకోడానికి ఇంకా చాలా సమయముంది. ముందుగా కోవిడ్ కష్టాలతో కుంగిపోతున్న ప్రజల గురించి ఆలోచించాలి. మును ముందుగా యనమల వంటి నాయకులు మనసులోంచి రాజకీయ మురుగును తొలగించుకోడానికి ప్రయత్నించాలి. అప్పుడే ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. కోవిడ్ కొంతైనా శాంతిస్తుంది.

—- శాంతారామ్, సీనియర్ జర్నలిస్టు