Joopudi Prabhakar: “మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంది బాలకృష్ణే: జూపూడి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు”

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్.. బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరని, పైగా బాలకృష్ణకే ‘మెంటల్ సర్టిఫికెట్’ ఉందని ఆరోపించారు. “అలాంటి వ్యక్తి మెంటల్ బాలకృష్ణ… జగన్‌ని సైకో అంటారా?” అని ప్రశ్నించారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఆయన హెచ్చరించారు.

గతంలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు జరిపిన కేసులో బాలకృష్ణ మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని జూపూడి ప్రభాకర్ గుర్తు చేశారు. “నువ్వు కాల్చినప్పుడు నీ మెంటల్‌ కండీషన్‌ ఏంటి బాలకృష్ణా?” అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి కావాలంటే తన సోదరి పురందేశ్వరిని అడిగి తెలుసుకోమని, ఆ రోజు నిన్ను కాపాడింది ఎవరో గుర్తు తెచ్చుకోమని బాలకృష్ణకు హితవు పలికారు.

బాలకృష్ణ సినిమాలకే హీరో అని, కానీ జగన్ ప్రజల్లో హీరో అని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. బాలకృష్ణ నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. అసలు జనంలోకి వస్తే సైకోలా ప్రవర్తించేదెవరో అందరికీ తెలుసంటూ బాలకృష్ణకు చురకలంటించారు. అసెంబ్లీ వేదికగా జగన్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు.

Jagan Chapter Close Soon..., Kutami Set A Plan | Janasena Chintala Lakshmi | Telugu Rajyam