జనసేన లెక్కతో బీజేపీకి తలనొప్పి మొదలైంది

with-the-janasena-count-the-bjp-started-having-headaches

జనసేన పార్టీ వెయ్యికి పైగా పంచాయితీల్ని గెలుచుకున్నట్లు ప్రకటించింది. 26 శాతం ఓటు బ్యాంకు దక్కించుకున్నామనీ చెబుతోంది జనసేన. ఇక్కడే మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కుతకుతలాడిపోతోంది. ఔను మరి, బీజేపీ – జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు.. గెలుపోటముల్లో ఏది ఎదురైనా.. దానికి రెండు పార్టీలూ బాధ్యత వహించాలి. క్రెడిట్ కూడా సమానంగానే పొందాలి. అయితే, పంచాయితీ ఎన్నికల వేళ బీజేపీ అంత యాక్టివ్‌గా లేదు. తమ పార్టీకి చెందిన ముఖ్య నేతల బంధువులు పోటీ చేసిన చోట్ల బీజేపీ, జనసేన సాయం తీసుకుంది తప్ప, జనసేనకు ఎక్కడా బీజేపీ సహాయ సహకారాలు అందించలేదన్న విమర్శలున్నాయి. కొన్ని చోట్ల అయితే బీజేపీ కార్యకర్తలు టీడీపీకి, వైసీపీకి కూడా సహకరించారంటూ గ్రౌండ్ లెవల్‌లో చర్చ జరిగింది. ఆ కారణంగానే జనసేన పార్టీ, ధైర్యంగా 1000కి పైగా సీట్లు సొంతంగా గెలుచుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీనికి తోడు, తిరుపతి ఉప ఎన్నికలో జనసేనకు టిక్కెట్ రావడానికి ఈ గణాంకాలు ఉపయోగపడతాయని జనసేన భావిస్తోంది. మరోపక్క, తిరుపతిపై బీజేపీ ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుండడం గమనార్హం.

with-the-janasena-count-the-bjp-started-having-headaches
with-the-janasena-count-the-bjp-started-having-headaches

పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ బలం చూశాక, ప్రతిపక్షం ఇంకా పూర్తిగా బలహీనమైపోలేదని తెలుసుకున్నాక.. బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక విషయమై వెనుకడుగు వేయడం వింతేమీ కాదు. అయితే, మున్సిపల్ అలాగే పరిషత్ ఎన్నికల నాటికి సీన్ మారుతుందని బీజేపీ కొంత ఆశాభావంతో వుంది. అదే సమయంలో జనసేన కూడా ఈ పరిషత్, మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రెండు ఎన్నికలూ పార్టీల గుర్తుల మీద జరుగుతాయి గనుక బీజేపీ – జనసేన కలిసే ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇక్కడ వచ్చే ఫలితాల్ని బట్టి, తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై ఇరు పార్టీలూ ఓ అవగాహనకి వస్తాయి. అయితే, 2019 ఎన్నికల తర్వాత బీజేపీ పెద్దగా పుంజుకోలేదుగానీ, జనసేన మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. అది బీజేపీకి అస్సలు మింగుడు పడని విషయం.