‘ఉస్తార్’ కోసం ‘గబ్బర్’ భామ.!

తెలుగు సినిమాని హీరోయిన్ల కొరత వేధిస్తోంది. పూజా హెగ్దే, రష్మిక మండన్న తప్ప వేరే హీరోయిన్లు పెద్ద సినిమాలకు కనిపించడంలేదా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.!

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం హీరోయిన్ల వేట కొనసాగుతోంది. తొలుత ఈ సినిమా కోసం పూజా హెగ్దే పేరు తెరపైకొచ్చింది. అయితే, ఆమె డేట్స్ పవన్ కళ్యాణ్‌కి అనుగుణంగా అడ్జస్ట్ అవుతాయా.? లేదా.? అన్నదానిపై గందరగోళం వుంది.

రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో పవన్ కాల్షీట్లు అంత తేలిక కాదు మరి.! ఈ నేపథ్యంలో డేట్స్ పరంగా ఇబ్బంది లేని హీరోయిన్ కోసం వెతుకుతున్నారట.

ప్రస్తుతానికైతే ‘గబ్బర్ సింగ్’లో పవన్‌తో జతకట్టిన శృతిహాసన్ పేరు ప్రచారంలోకి వస్తోంది. ఆమె ‘కాటమరాయుడు’ సినిమాలోనూ పవన్‌తో కలిసి నటించింది. అయితే, శృతి పాత్ర ‘ఉస్తాద్’లో చిన్నదే వుంటుందనీ, గెస్ట్ రోల్ కావొచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయ్. త్వరలోనే హీరోయిన్ విషయమై స్పష్టత రానుందట.