‘గుంటూరు కారం’ సినిమాలో మొదట హీరోయిన్గా పూజా హెగ్ధేని అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలీల వచ్చి చేరింది. మొదట సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల పాత్రను మార్పులు చేర్పులు చేసి మెయిన్ లీడ్ చేశారు.
దాంతో, ముందుగా అనుకున్న డేట్స్ కన్నా ఎక్కువ డేట్స్‌ని ఈ సినిమా కోసం శ్రీలీల కేటాయించాల్సి వచ్చిందట. మహేష్ సినిమా కాబట్టి వెనకా ముందు ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేసిందట.
ఇప్పుడేమో సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దాంతో, ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల విషయంలో ఒత్తిడి ఎదుర్కోవల్సి వస్తోందట శ్రీలీల. ఎన్ని సినిమాలు చేసినా మహేష్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరే లెవల్. అయితే, ఈ సినిమా పూర్తవుతుందా.? లేదా.? అనే డైలమా ప్రచారంలో వుంది. దాంతో,, శ్రీలీలలో టెన్షన్ మొదలైందట.
ఓ వైపు క్రేజీ మూవీ.. మరోవైపు కెరీర్‌ని డిసైడ్ చేసే ఇతర కమిట్మెంట్ మూవీస్.. ఇలా ఎటూ తేల్చుకోలేక మరోవైపు ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో కమిట్ అయిన సినిమాలకి ఈ సినిమా కారణంగా డేట్స్ కేటాయించలేకపోతోందట శ్రీలీల.