ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో.. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ, ఆయన పాలనలో ఏపీ బాగా అభివృద్ధి చెందుతుందంటూ రజనీకాంత్ ప్రశంసించడంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ను నాడు వైశ్రాయ్ హోటల్ లో చంద్రబాబు గద్దె దింపినప్పుడు, చెప్పులేయించినప్పుడు రజనీకాంత్ అక్కడే ఉన్నారని కొడాలి నాని వంటి నేతలు ఆరోపణలు చేశారు. నేడు బాబును పొగుడుతూ.. ఎన్టీఆర్ కు రజనీకాంత్ మరోసారి వెన్నుపోటు పొడిచారని రోజా వంటి నేతలు ఫైరవుతున్నారు. ఇందులో భాగంగా… తాజాగా సిల్క్ స్మిత మరణానికి రజనీకాంతే కారణం అంటూ ఒక లేఖ వైరల్ అవుతుంది. దీన్ని వైసీపీ జనాలే వైరల్ చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు!
అవును… దివంగత నటి సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంతే కారణమని అర్థం వచ్చేలా ఉన్న ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సిల్క్ స్మిత చివరిగా రాసిన లేఖ ఇదేనంటూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతుగా రజనీకాంత్ మాట్లాడటం… పైగా నాడు ఎన్టీఆర్ ని బాబు వెన్నుపోటు పొడవడంలో రజనీపాత్ర ఉందనే విషయం తాజాగా తెరపైకి వచ్చిన అనంతరం ఈ లేఖ వైరల్ అవ్వడం గమనార్హం!
“దేవుడా… నా 7వ సంవత్సరం నుంచి పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నమ్మినవారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ నాకు లేరు. బాబు తప్ప నాపై ఎవరూ ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా… అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు. రాము, రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ నాకు వారు చేసింది చాలా దారణం. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తిననివాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను” అని ఈ లేఖలో రాసి ఉంది!
ఈ లేఖలో… “నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నా… అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాడిని చూసుకుంటాడు” అనే లైన్లు… “నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు” అని ఉన్న సెంటెన్స్ లూ రజనీ కాంత్ ని ఉద్దేశించి సిల్క్ స్మిత రాసిందని చెబుతున్నారు. పైగా… సిల్క్ స్మిత చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదని, దీనికి కూడా రజనీకాంతే కారణం అని చెబుతున్నారు. అయితే… వీటిపై కొందరు సీనియర్ సినిమా పండితులు… వాస్తవమే అన్నట్లుగా పరోక్షంగా స్పందించడం కొసమెరుపు!