ఏ సీన్ కట్ చేయాలని లేదు.. ఏ డైలాగ్‌నీ తగ్గించలేం.. అందుకే, ‘దేవర’ సినిమాని రెండు పార్టులుగా విడుదల చేయబోతున్నాం.. ఇదీ దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన వివరణ.
జూనియర్ ఎన్టీయార్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా రెండు పార్టులుగా రాబోతోందని మొట్టమొదట ‘బ్రేక్’ చేసిందే, తెలుగు రాజ్యం డాట్ కామ్.! వాస్తవానికి తొలుత అనుకున్న కథ వేరు, ఆ తర్వాత మారిన పరిస్థితులు వేరు.!
ఇక, ఇప్పుడు రెండు పార్టులుగా సినిమా చేయడానికి ఇంకో బలమైన కారణం కూడా వుంది. అదేంటంటే, గ్రాఫిక్స్ పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశం వుందట. దాంతోపాటుగా, ఇతరత్రా సమస్యలూ వున్నాయట కథ పరంగా.! ఫైనల్ టచ్ ఇచ్చే విషయమై కొరటాల కొంత గందరగోళానికి గురయినట్లుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, అన్నీ కలిసొస్తాయ్.. రెండు పార్టులుగా చేసేద్దామని జూనియర్ ఎన్టీయార్ స్వయంగా సూచించాడట దర్శకుడు కొరటాల శివకి. అలాగైతే, కథని ఫినిష్ చేయడానికి ఇంకాస్త సమయం దొరుకుతుంది. ఫస్ట్ పార్ట్ సాధించే రిజల్ట్‌ని బట్టి, ముగింపుని ప్లాన్ చేసుకోవచ్చు.!
‘పుష్ప’ సినిమాకి కూడా ఇదే సమస్య ఎదురయ్యింది. అదే ఇప్పుడు ‘దేవర’కి కూడా ఎదురయ్యిందని అంటున్నారు. కథలో దమ్ము వుంటే, రేంజ్ పెరుగుతుందిగానీ, పార్టులు పార్టులుగా చేసినంతమాత్రాన రేంజ్ పెరిగిపోతుందా.?